Health: ఈ ఆకులను రోజుకు రెండు తినండి.. చాలా మార్పులు కనిపిస్తాయి
ప్రకృతి మనకు అందించిన చెట్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం తెలిసిందే. చెట్ల ఆకుల మొదలు బెరడు వరకు అన్ని ఆరోగ్యానికి మేలు చేసేవో. సాధారణంగా మనం చెట్లకు కాసే పండ్లు లేదా కూరగాయలు మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తాయనే భావనలో ఉంటాం. అయితే ఆకులు కూడా ఆరోగ్యాన్ని కాపాడుతాయని మీకు తెలుసా.? ఆరోగ్యానికి మేలు చేసే అలాంటి కొన్ని ఆకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* మనం ప్రతీ రోజూ వంటకాల్లో ఉపయోగించే వాటిలో పుదీనా ఒకటి. పుదీనాను చట్నీ రూపంలో, బిర్యానీలో ఇలా రకరకాలుగా తీసుకుంటాం. అయితే ప్రతీ రోజూ రెండు పుదీన ఆకులను పచ్చిగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఉదయాన్నే రెండు పుదీనా ఆకులను తింటే కడుపులో ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. పుదీనా కడుపుని చల్లబరచడంతో పాటు, నొప్పిని తగ్గిస్తాయి.
* వేపలో ఎన్నో ఔషధ గునాలు ఉంటాయని తెలిసిందే. రోజు రెండు తాజాగా వేప ఆకులను నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తపోటు, మధుమేహం వంటివి కూడ అదుపులో ఉంటాయి. వేప ఆకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి, చర్మాన్ని మొటిమలు లేకుండా ఉంచుతాయి.
* తులసి ఆకులకు మన ఆయుర్వేద గ్రంధాల్లో ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజు తులసి ఆకులను నమిలి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు జలుబు, దగ్గు, సీజనల్ వ్యాధులకు చెక్ పెడుతుంది.
* జామ ఆకు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజు జామ ఆకును పచ్చిగా నిమిలి తీసుకుంటే.. రక్తహీనత తగ్గుతుంది. ఇందులోని విటమిన్ సి, ఐరన్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..