Lifestyle: సరిగ్గా నమలకుండానే మింగేస్తున్నారా.? ఏం జరుగుతుందంటే..
అయితే ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తీసుకుంటే కొన్ని రకాల ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. తీసుకున్న ఆహారాన్ని 32 సార్లు నమలాలని నిపుణులు చెబుతున్నారు. వినడానికి ఇది కాస్త కష్టంగానే అనిపించినా ఇలా తింటేనే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. ఇంతకీ ఎక్కువ సార్లు నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మనం ఆహారం తీసుకునే విధానంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే సరైన ఆహారం తీసుకోవాలని నిపునులు సూచిస్తుంటారు. అయితే కేవలం తీసుకునే ఆహారం సరైనది అయితే మాత్రమే సరిపోదు. తీసుకునే విధానం కూడా సరిగ్గా ఉండాలని మీకు తెలుసా.? సాధారణంగా ఏ ఆహారం తీసుకున్నా నమిలిన తర్వాతే మింగుతాం.
అయితే ఆహారాన్ని సరిగ్గా నమలకుండా తీసుకుంటే కొన్ని రకాల ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. తీసుకున్న ఆహారాన్ని 32 సార్లు నమలాలని నిపుణులు చెబుతున్నారు. వినడానికి ఇది కాస్త కష్టంగానే అనిపించినా ఇలా తింటేనే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. ఇంతకీ ఎక్కువ సార్లు నమలడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఆహారాన్ని సరిగ్గా నమిలి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని ఎక్కువసార్లు నమలడం వల్ల చిన్న చిన్న ముక్కలుగా మారుతుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడడంలో ఉపయోగపడుతుంది. దీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దీంతో పొట్ట ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.
* ఆహారాన్ని బాగా నమలడం వల్ల అందులో ఉండే పోషకాలు పూర్తి స్థాయిలో శరీరం గ్రహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి బలోపేతమవుతుంది.
* బరువు తగ్గాలనుకునే వారు కూడా ఆహారాన్ని సరిగ్గా నమిలి తినడం అలవాటుగా మార్చుకోవాలి. ఇలా తినడం వల్ల తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. శరీంలో అదనపు కొవ్వులు పెరిగే ఆస్కారం ఉండదు.
నోట్: పైన తెలిసిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..