- Telugu News Photo Gallery Weight Loss Diet: These Five Healthy Vegetables To Help Reduce Extra Fat in your body
Weight Loss Vegetables: ఒంట్లో కొవ్వు కరిగించడానికి కసరత్తులు చేయక్కర్లేదు.. వంటపై కాస్త శ్రద్ధ పెడితే సరి!
నేటి గజిమిజి జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఊబకాయంతో బాధపడుతున్నారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలంటే బరువు అదుపులో ఉండాలి.దీంతో బరువు తగ్గడం కోసం కొందరు రకరకాల తిప్పలు పడుతుంటారు. బరువు తగ్గాలంటే ఆహారం, వ్యాయామం అన్నీ తప్పనిసరి. అలాగే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినడం ద్వారా..
Updated on: Jun 20, 2024 | 1:29 PM

నేటి గజిమిజి జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఊబకాయంతో బాధపడుతున్నారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలంటే బరువు అదుపులో ఉండాలి.దీంతో బరువు తగ్గడం కోసం కొందరు రకరకాల తిప్పలు పడుతుంటారు.

బరువు తగ్గాలంటే ఆహారం, వ్యాయామం అన్నీ తప్పనిసరి. అలాగే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినడం ద్వారా సహజ సద్ధతుల్లో శరీర బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

రోజువారీ ఆహారంలో కొన్ని రకాల కూరగాయలను ఉంచుకోవడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అటువంటి వాటిల్లో ముఖ్యమైనది సొరకాయ. ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. ఈ కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో సొరకాయ రసాన్ని తాగితే శరీరంలోని అదనపు కొవ్వు ఇట్లే కరిగిపోతుంది.

చాలా మంది కాకరకాయ పేరు వినగానే ముఖం చిట్లిస్తారు. నిజానికి ఇందులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మధుమేహం, హృద్రోగులు బరువు తగ్గాలనుకుంటే క్రమం తప్పకుండా కాకరకాయలను ఆహారంలో తీసుకోవాలి. ఇది కొవ్వును కరిగించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది.

టొమాటోలో మినరల్స్, విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. అలాగే ఈ కూరగాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ సి టమోటాలలో పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. దీనితోపాటు బరువు తగ్గాలనుకునే వారు క్యారెట్ కూడా తినాలి. ఇందులో కేలరీలు చాలా తక్కువ. క్యారెట్‌లోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఆకలిని కూడా తగ్గిస్తుంది.




