Bone Health: ఎముకలు బలహీనంగా ఉన్నాయా.. వీటిని తిన్నా క్యాల్షియం అందుతుంది!
ఎముకలు బలంగా ఉండి, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎముకలు గట్టిగా ఉంటే వృద్ధాప్యంలో కూడా వారి పనులు వాళ్లే చేసుకోగలుగుతారు..

చాలా మంది ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. ఎముకలు బలహీనంగా ఉండటం వల్ల.. ఎలాంటి పని చేయాలన్నా శరీరం సహకరించదు. ఏదైనా పని చేసినా త్వరగా ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. ఈ కాలంలో వయసులో ఉన్నవారే బలంగా ఉండే పనులు చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పట్లో వృద్ధాప్యంలో కూడా అనేక పనులు చేసేవారు. శరీరం బలంగా, దృఢంగా ఉండాలంటే క్యాల్షియం చాలా ముఖ్యం. ఎముకలకు సరైన విధంగా క్యాల్షియం అందకపోతే అనేక సమస్యలు రావడం ఖాయం. ఎముకలు గుల్లబారిపోయి.. ఏ పని చేయాలన్నా శరీరం సహకరించదు. క్యాల్షియం తీసుకోవడం వల్ల కేవలం శరీరం మాత్రమే కాకుండా.. ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండి.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తీసుకుంటే సరిపోతుంది. మరి అవేంటో ఇప్పుడు చూడండి.
అంజీర్:
అంజీర్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక పోషకాలు నిండి ఉంటాయి. ప్రతి రోజూ ఒక అంజీర్ తినడం వల్ల అనేక సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇందులో క్యాల్షియం కంటెంట్ కూడా ఎక్కువ మోతాదులోనే లభిస్తుంది. కాబట్టి అంజీర్ తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. త్వరగా విరిగిపోకుండా ఉంటాయి. రాత్రి పూట నానబెట్టి ఉదయాన్నే తింటే చాలా మంచిది. జీర్ణ సమస్యలు, శరీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వును కూడా కరిగిస్తుంది.
నారింజ పండు:
నారింజ పండ్లు తిన్నా క్యాల్షియం కొరత ఉండదు. నారింజలో ఎక్కువ మోతాదులో క్యాల్షియం లభిస్తుంది. ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల క్యాల్షియాన్ని సులువుగా శోషించుకుంటుంది. నారింజ పండు తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి.
బాదం:
బాదం తినడం వల్ల కేవలం ప్రోటీన్, ఫైబర్ మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. క్యాల్షియం తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో కూడా క్యాల్షియం లభిస్తుంది. బాదం పప్పు రాత్రి పూట నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలు, కండరాలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. అదే విధంగా బెండకాయలు, సాల్మన్ ఫిష్ తిన్నా క్యాల్షియం అందుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..








