- Telugu News Photo Gallery Hair fall will not be a problem if this oil is applied to the head, Check Here is Details
Hair Fall: తలకు నూనె ఇలా రాస్తే.. హెయిర్ ఫాల్ సమస్య ఉండదు..
ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందులోనూ చలికాలంలో ఈ సమస్యలు మరింత వేధిస్తాయి. తలకు నూనెను ఇలా పెడితే.. చాలా వరకు జుట్టు రాలడం తగ్గుతుంది..
Updated on: Dec 09, 2024 | 4:30 PM

జుట్టు అనేది ఒత్తుగా ఉంటే అందరికీ ఇష్టం. మగవారికైనా, ఆడవారికైనా జుట్టు ఉంటేనే మరింత అందం అనేది తోడవుతుంది. ప్రస్తుత కాలంలో జుట్టు సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. చాలా మందికి జుట్టు రాలిపోయి.. పల్చగా అంద విహీనంగా మారుతుంది.

జుట్టుకు పోషకాలు అందక చాలా వరకు రాలిపోతుంది. ఫుడ్ ద్వారానే చాలా వరకు పోషణ అందించవచ్చు. ఆ తర్వాత మనం చేసే తప్పిదాల వల్ల కూడా జుట్టు అనేది రాలిపోతుంది. జుట్టుకు ఆయిల్ రాసే విధానంలో కూడా జుట్టు రాలడం ఉంటుంది.

చాలా మందికి జుట్టుకు ఆయిల్ రాయడం కూడా రాదు. ఎలా పడితే అలా రాయడం వల్ల కుదుళ్లు డిస్టర్బ్ అయి రాలిపోతుంది. ఆయిల్‌ని గోరు వెచ్చని నీళ్ల ద్వారా వేడి చేసి.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకు పట్టించాలి. కొద్దిగా ఆయిల్ తీసుకుంటూ.. చేతి వేళ్లతో కుదుళ్లకు పట్టించాలి.

జుట్టు మొత్తం రాయకుండా.. కేవలం మాడుపై మాత్రమే రాసి లైట్‌గా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ జరుగుతుంది. దీంతో జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గోరు వెచ్చని నూనె కాకుండా సాధారణ నూనె అయినా ఇదే క్రమంలో రాసుకోవచ్చు.

గోరు వెచ్చని నూనె రాయడం వల్ల జుట్టు ఎంతో కాంతివంతంగా, స్మూత్‌గా మారుతుంది. రక్త ప్రసరణ జరిగి జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు హెల్ప్ అవుతుంది. జుట్టుకు నూనె పట్టించే విధానం కూడా ముఖ్యం.




