Velpula Bharath Rao |
Updated on: Dec 09, 2024 | 1:44 PM
ఈ స్మార్ట్‌ఫోన్‌ల్లో ప్రత్యేక ఫీచర్లు, కెమెరా ఉంది. దీనితో మీరు ఫోన్‌లో గొప్ప ఫోటో-వీడియోగ్రఫీని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ మూడు ఫోన్లు మల్టీ టాస్కింగ్‌కు మంచిగా పనికి వస్తుందని చెప్పవచ్చు.
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ 2024 ప్రకారం Apple, Redmi 13C, Samsung ఫోన్‌లు 10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఉన్నాయి.
Apple iPhone 15:ఈ ఫోన్ టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ 2024 నివేదిక ప్రకారం, 2024 మధ్యలో ఐఫోన్ 15 అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రెండవ, మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతే కాదు 2022లో వచ్చిన Apple iPhone 14 కూడా ఈ లిస్ట్‌లో చేరింది.
Apple iPhone 15 ధర రూ. 64,900 ఉంది. దీని ప్రో మాక్స్ మోడల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,28,900గా ఉంది. Apple iPhone 15 Pro ప్రారంభ ధర రూ. 1,03,999గా ఉంది.
Samsung Galaxy: Samsung Galaxy ఫోన్‌లు జాబితాలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. Samsung Galaxy A సిరీస్‌లో Galaxy A15 4G, Samsung Galaxy A15 5G, Samsung Galaxy A05, Samsung Galaxy A35 లను ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.
Samsung Galaxy A15 4G ప్రారంభ ధర రూ. 12,990 కాగా Samsung Galaxy A15 5G ప్రారంభ ధర రూ. 15,499గా ఉంది.
Xiaomi Redmi 13Cని కూడా చాలా మంది కొనుగోలు చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 కంటే తక్కువ ఉంది. ఈ ఫోన్ 6.74-అంగుళాల HD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ వంటి అద్భుతమైన ఫిచర్లు కలిగి ఉంది.