Dandruff: చలికాలంలో చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టండి

చలికాలం దాదాపు వచ్చేసింది. ఈ సీజన్‌లో చుండ్రు అనేది అందరికీ సాధారణం. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల చుండ్రును సులభంగా వదిలించుకోవచ్చు. చుండ్రుతో సహా అనేక జుట్టు సమస్యలకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

Dandruff: చలికాలంలో చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టండి
Remedies For Dandruff
Follow us
Basha Shek

|

Updated on: Nov 04, 2022 | 10:15 PM

చలికాలం దాదాపు వచ్చేసింది. ఈ సీజన్‌లో చుండ్రు అనేది అందరికీ సాధారణం. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల చుండ్రును సులభంగా వదిలించుకోవచ్చు. చుండ్రుతో సహా అనేక జుట్టు సమస్యలకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఒక కప్పు నీటిలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ జోడించండి. జుట్టుకు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో తలను మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత మీ జుట్టును కడిగేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్, గార్లిక్ ప్యాక్‌తోనూ చుండ్రు సమస్యల ఉపశమనం పొందవచ్చు. ఇందుకోసం ముందుగా వెల్లుల్లిని మెత్తగా తురుముకుని రసం తీయండి. అప్పుడు వెల్లుల్లి రసంలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ జోడించండి. దీన్ని జుట్టుకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూతో తలను కడగాలి. మంచి ఫలితాల కోసం వారానికి 1 నుండి 2 సార్లు ఇలా చేయండి.

ఆపిల్ సైడర్ వెనిగర్- పెరుగు ప్యాక్

ఇందుకోసం అరకప్పు పెరుగులో 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. 30 నుంచి 40 నిమిషాల తర్వాత, షాంపూతో మీ తలను కడగాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్-కాస్టర్ ఆయిల్‌

ఒక కప్పు నీటిలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ జోడించండి. ఈ మిశ్రమానికి 2-3 స్పూన్ల ఆముదం కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. అప్పుడు స్నానం చేయండి.

ఇవి కూడా చదవండి

ఆలివ్ నూనె, నిమ్మరసం

అంతే కాకుండా చుండ్రు సమస్యను దూరం చేయడానికి ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వాడాలి. ఇందుకోసం 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌లో 1 టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు, తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయండి. మీరు దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తే మీకు తేడా కనిపిస్తుంది.

అలోవెరా జ్యూస్, నిమ్మకాయ వాడకం

కలబంద రసం, నిమ్మకాయను ఉపయోగించడం వల్ల చుండ్రు తగ్గుతుంది. దీని కోసం, ఒక గిన్నెలో 3 చెంచాల కలబంద రసం తీసుకోండి. దీనికి కొద్దిగా నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు, తలకు పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తే చుండ్రు సమస్యను దూరం చేసుకోవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..