Relationship Tips: దంపతుల మధ్య వివాదాలా.. మీ బెస్ట్ రిలేషన్షిప్ కోసం సింపుల్ చిట్కాలు మీకోసం
మీ భాగస్వామి మీకు మునుపటి కంటే మీ పట్ల శ్రద్ధ తక్కువైందని భావిస్తే.. అటువంటి పరిస్థితిలో, కలత చెందకుండా, మీరు కొన్ని మంచి పద్ధతులను అనుసరించాలి. ఇక్కడ మేము మీకు కొన్ని బెస్ట్ రిలేషన్షిప్ చిట్కాలను చెప్పబోతున్నాము.
Relationship Tips: అది వైవాహిక జీవితమైనా లేదా ప్రేమ బంధమైనా , సాధారణంగా ఎలాంటి రిలేషన్స్ లోనైనా కాలం గడిచేకొద్దీ పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. ఒకరితోనొకరు సమయం ఇచ్చుకుని గడపడం.. మాట్లాడే విధానం ఇలా అన్నిటిలోనూ మార్పులు వస్తాయి. ఇలా రిలేషన్స్ లో మార్పులు రావడం వెనుక ఖచ్చితమైన కారణం లేదు. ఇలా రిలేషన్స్ లో మార్పులు రావడం సర్వసాధారణంగా మారింది. అనేక సందర్భాల్లో, భాగస్వాములు ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపించుకోవడం కూడా తగ్గించుకుంటారు. పనిభారం లేదా బాధ్యతల కారణంగా, ఈ మార్పులు సంబంధంలో రావడం ప్రారంభించవచ్చు.. ముఖ్యంగా జంటలు విసుగుతో ఒకరికొన్నారు ఆరోపణలు చేయడం ప్రారంభిస్తారు. భార్య భర్తలు ఆధిపత్యం చెలాయించడం కోసం ప్రయత్నిస్తే.. అప్పుడు సంబంధంలో సమస్యలు పెరగడం ప్రారంభమవుతాయి. కొన్ని సార్లు వివాదాలు చోటు చేసుకుంటాయి.
అయితే మీ భాగస్వామి మీకు మునుపటి కంటే మీ పట్ల శ్రద్ధ తక్కువైందని భావిస్తే.. అటువంటి పరిస్థితిలో, కలత చెందకుండా, మీరు కొన్ని మంచి పద్ధతులను అనుసరించాలి. ఇక్కడ మేము మీకు కొన్ని బెస్ట్ రిలేషన్షిప్ చిట్కాలను చెప్పబోతున్నాము. వీటిని మీరు సులభంగా అవలంబించవచ్చు, సంబంధాన్ని మెరుగుపరచుకోవచ్చు.
ఫోన్‌కి దూరంగా ఉండండి: వయసుతో సంబంధం లేదు ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఎక్కువ సమయం ఫోన్‌లో వీడియోలను చూస్తూ గడిపేస్తున్నారు. ప్రజలు స్మార్ట్ ఫోన్‌లకు బాగా అలవాటు పడ్డారు. తమ ముఖ్యమైన పనులను కూడా విస్మరిస్తున్నారు. ప్రజలు పడుకునే సమయంలో కూడా ఫోన్‌ని ఖచ్చితంగా వాడుతున్నారు. అయితే ఈ అలవాటు ఏ భాగస్వామికి ఉన్నా వెంటనే మార్చుకోవాలి. నిద్రవేళలో.. ఫోన్‌ను పక్కపక్కపెట్టి.. ఒకరికొకరు సమయం కేటాయించండి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదా ఒకరిపై ఒకరు ఆసక్తిని పెంచుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా.. మీ భాగస్వామి మీకు శ్రద్ధ చూపడం ప్రారంభిస్తారు.
మీరిద్దరూ ఇష్టపడే పనులు చేయండి భాగస్వామి దృష్టిని ఆకర్షించడానికి.. మీ ఇద్దరికీ నచ్చిన పనిని చేయండి.. దంపతులు కలిసి కూర్చుని వెబ్ సిరీస్ చూడాలన్నా.. సరదాగా మాట్లాడుకోవడం వంటివి చేయండి.. ఇలా ఒకరినొకరు కలిసి గడపం అలవాటు చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేయడం ద్వారా కూడా, మీరు మళ్లీ సంబంధాన్ని మెరుగుపరచుకోవచ్చు.
ట్రిప్ ప్లాన్ చేయండి మీరు మానసిక స్థితిని మెరుగుపరచుకోవాలనుకుంటే లేదా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలనుకుంటే, విహారయాత్రకు వెళ్లడం ఉత్తమం. మీకు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలంటే.. లాంగ్ ట్రిప్ కాకపోయినా కనీసం వారంలో ఒక రోజు పర్యటనను ప్లాన్ చేసుకోండి. పర్యటన సమయంలో దంపతులు ఒకరితో ఒకరు సమయం గడపగలుగుతారు. అటువంటి పరిస్థితిలో మీ బంధం మెరుగుపడటమే కాకుండా, మీ భాగస్వామి మీ పట్ల మళ్లీ శ్రద్ధ చూపడం ప్రారంభిస్తారు.
(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా ఇవ్వబడింది. వీటిని TV9 తెలుగు ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించిన సలహాలు, సూచనలతో మాత్రమే దీన్ని అనుసరించండి.)