Health Tips: ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లే

Health Care Tips: మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే విపరీతమైన పని ఒత్తిడితో కూడిన ఈ యాంత్రిక జీవితంలో ఇప్పుడు ఆహారపు అలవాట్లలో బాగా మార్పులు వచ్చాయి.

Health Tips: ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లే
Empty Stomach Foods
Follow us
Basha Shek

|

Updated on: Jul 31, 2022 | 12:24 PM

Health Care Tips: మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే విపరీతమైన పని ఒత్తిడితో కూడిన ఈ యాంత్రిక జీవితంలో ఇప్పుడు ఆహారపు అలవాట్లలో బాగా మార్పులు వచ్చాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటున్నారు. ఇదే క్రమంలో కొందరు ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటుంటారు. అయితే పరగడుపునే తీసుకునే ఫుడ్స్‌ విషయంలో ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనలు తప్పనిసరి. లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవు. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్‌ను దూరం పెట్టాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

పండ్ల రసాలు

మనం తీసుకునే ఆహారంలో పండ్ల రసాలు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్‌పై అదనపు భారం పడుతుంది. ఇక పండ్లలో ఫ్రక్టోజ్ రూపంలో ఉండే చక్కెర కాలేయంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. టొరంటో విశ్వవిద్యాలయం న్యూట్రిషనల్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్ పరిశోధన ప్రకారం, ఇది ఆరోగ్యకరమైన ఎంపికగా కనిపిస్తున్నప్పటికీ, పండ్లను జ్యూస్ గా చేసేటప్పుడు, జ్యూస్ ఎక్స్‌ట్రాక్టర్లు పీచు పల్ప్ నుండి రసాన్ని వేరు చేయడం వల్ల ఆరోగ్యకరమైన ఫైబర్‌లో కొంత భాగం పోతుంది.

ఇవి కూడా చదవండి

పుల్లటి పండ్లు

బేరి, నారింజ వంటి సిట్రస్ పండ్లు పొట్టలో యాసిడ్ స్థాయులను పెంచుతాయి. ఫలితంగా పొట్టలో పుండ్లు, గ్యాస్ట్రిక్ అల్సర్ల ప్రమాదం పెరుగుతుంది. ఇక పండ్లలోని ఫైబర్, ఫ్రక్టోజ్ వల్ల జీర్ణవ్యవస్థ క్రమంగా నెమ్మదిస్తుంది.

టీ, కాఫీలు

ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్థాయులు పెరుగుతాయి. దీనివల్ల పొట్టలో పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

పెరుగు

పెరుగు వంటి పులియబెట్టిన పాల ఉత్పత్తులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల పెరుగులోని లాక్టిక్ యాసిడ్ బాక్టీరియాతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇంకా, అధిక ఆమ్ల స్థాయుల కారణంగా కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్ల స్థాయులు పెరుగుతాయి. దీని వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

సలాడ్లు

సలాడ్ చేయడానికి ఉపయోగించే పచ్చి కూరగాయలు బహుశా మధ్యాహ్న భోజనానికి ఉత్తమ ఎంపిక. పచ్చి కూరగాయలు ఫైబర్‌తో నిండి ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే అపానవాయువు అలాగే కడుపు నొప్పికి కారణమవుతుంది. టొమాటోలు, ఉదాహరణకు, టానిక్ యాసిడ్ కలిగి ఉంటాయి, ఇది కడుపులో గ్యాస్ట్రిక్ రసాలతో సంబంధం కలిగి ఉంటుంది. దీనిని ఖాళీ కడుపుతో తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

గమనిక.. ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.. సలహాలు, సూచనలు పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..