AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: పెర్‌ఫ్యూమ్‌ లు ఎక్కువగా వాడేస్తున్నారా.. జాగ్రత్తలు పాటించకపోతే ఆ సమస్యలు తప్పవు

ప్రస్తుత కాలంలో పెర్‌ఫ్యూమ్‌ లు విశేష ఆదరణ పొందాయి. ఆడ,మగ అనే తేడా లేకుండా అందరూ వీటిని ఉపయోగిస్తున్నారు. పార్టీ ఆయినా, ఫంక్షన్ అయినా, సందర్భం ఏదైనా సెంట్ కొట్టుకని బయటకు వెళ్తాం. అయితే.. పెర్‌ఫ్యూమ్‌ను ఎంచుకోవడంలో...

Health: పెర్‌ఫ్యూమ్‌ లు ఎక్కువగా వాడేస్తున్నారా.. జాగ్రత్తలు పాటించకపోతే ఆ సమస్యలు తప్పవు
Body Spray
Ganesh Mudavath
|

Updated on: Jul 31, 2022 | 11:25 AM

Share

ప్రస్తుత కాలంలో పెర్‌ఫ్యూమ్‌ లు విశేష ఆదరణ పొందాయి. ఆడ,మగ అనే తేడా లేకుండా అందరూ వీటిని ఉపయోగిస్తున్నారు. పార్టీ ఆయినా, ఫంక్షన్ అయినా, సందర్భం ఏదైనా సెంట్ కొట్టుకని బయటకు వెళ్తాం. అయితే.. పెర్‌ఫ్యూమ్‌ను ఎంచుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు తెలుసా? పెర్‌ఫ్యూమ్ వేసుకోవడమే కాదు.. దాన్ని ఎంచుకోవడం కూడా ఒక నైపుణ్యమేనని విశ్లేషకులు చెబుతున్నారు. పెర్‌ఫ్యూమ్‌ సువాసన మనసుకి ప్రశాంతతను చేకూర్చేలా, గాఢత ఎక్కువ సమయం నిలిచి ఉండేలా చూసుకోవాలి. అలా అయితేనే మనం వేసుకునే పెర్‌ఫ్యూమ్ వల్ల ప్రయోజనం ఉంటుంది. మనం వాడే పెర్‌ఫ్యూమ్ సీజన్‌ను బట్టి మార్చాలి. వేసవి కాలంలో చర్మం ఎక్కువ తేమగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో కంటే వేసవిలోనే పెర్‌ఫ్యూమ్ వాసన ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి తక్కువ గాఢత ఉండే పెర్‌ఫ్యూమ్‌ను వేసవిలో, ఎక్కువ గాఢత ఉండే వాటిని చలికాలంలో ఎంచుకుంటే మంచిది. గాఢత మరీ ఎక్కువగా ఉండే పెర్‌ఫ్యూమ్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని పెర్‌ఫ్యూమ్ ఉపయోగించాలి. మన చుట్టూ ఉన్నవారికి ఆ వాసన పడకపోతే వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం అనేది రోజూవారీ ప్రణాళికలో ఒక భాగమే. ఎక్కువ పెర్‌ఫ్యూమ్ వేసుకుంటే దాని వాసన ఎక్కువసేపు ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ దాని వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. పెర్‌ఫ్యూమ్ మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండాలి. దాని వాసన మీ శరీర తత్వానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. స్నానం చేసిన తర్వాత శరీరం తేమగా ఉన్నప్పుడే పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే దాని వాసనను శరీరం బాగా పీల్చుకుంటుంది. మనం స్నానానికి ఉపయోగించే సబ్బు వాసన.. పెర్‌ఫ్యూమ్ వాసన కంటే తక్కువగా ఉండాలి. అప్పుడే పెర్‌ఫ్యూమ్ ఎక్కువ సువాసనలు వెదజల్లుతుంది. పెర్‌ఫ్యూమ్‌లను ఎంచుకోవడమే కాదు వాటిని భద్రపరుచుకోవడం కూడా చాలా ముఖ్యమే. పెర్‌ఫ్యూమ్‌ను పొడిగా, చల్లగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. ఇలా చేస్తే అవి సువాసనను కోల్పోకుండా ఉంటాయి.

పెర్‌ఫ్యూమ్ ఎక్కువగా వాడే వాళ్లకు చర్మ సంబంధ సమస్యలు వస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో పెర్‌ఫ్యూమ్ తయారీలో వాడతున్న రసాయనాలతో మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని ఓ సర్వేలో తేలింది. మంచి వాసన వస్తోందని అతిగా పెర్‌ఫ్యూమ్స్ వాడితే చర్మవ్యాధులతో పాటు ముక్కు, కళ్లు, గొంతు నొప్పి, మతిమరుపు, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.