Ice Cream: వర్షంలో ఐస్ క్రీం తినే అలవాటు మీకూ ఉందా? ముందీ విషయం తెలుసుకోండి..
సాధారణంగా వేసవిలో చల్లని ఐస్ క్రీం తినడం షరా మామూలే. దీనివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు. కానీ చాలా మంది వర్షాకాలంలో కూడా ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు. ఈ సమయంలో వీలైనంత వేడి ఆహారాలు తినడం మంచిది. కానీ కొంతమంది ఎంత వర్షం కురిసినా, ఎంత చలిగా ఉన్నా, ఏ సమయంలోనైనా ఐస్ క్రీం తింటుంటారు..

పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు. అయితే కొంతమంది సీజన్‌తో పనిలేకుండా అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో తినేస్తుంటారు. సాధారణంగా వేసవిలో చల్లని ఐస్ క్రీం తినడం షరా మామూలే. దీనివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు. కానీ చాలా మంది వర్షాకాలంలో కూడా ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు. ఈ సమయంలో వీలైనంత వేడి ఆహారాలు తినడం మంచిది. కానీ కొంతమంది ఎంత వర్షం కురిసినా, ఎంత చలిగా ఉన్నా, ఏ సమయంలోనైనా ఐస్ క్రీం తింటుంటారు. కానీ వర్షాకాలంలో ఐస్ క్రీం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా? వర్షాకాలంలో ఐస్ క్రీం తినడం మంచిదేనా? వంటి సందేహాలకు ఇక్కడ సమాధానం తెలుసుకుందాం..
జలుబు, దగ్గు, ఛాతీ బిగుతుగా అనిపించడం
వర్షాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వేడి ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. ఇందుకు విరుద్ధంగా చల్లని ఆహారాలు తీసుకోవడం మంచిది కాదని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా ఐస్ క్రీం వంటి ఆహారాలు చల్లని వాతావరణంలో తీసుకుంటే జలుబు, దగ్గు, ఛాతీ బిగుతు వంటి సమస్యలు వస్తాయి. అంతే కాదు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా సంభవించవచ్చు.
వేగంగా ఊబకాయం
ఐస్ క్రీంలో చక్కెర, కేలరీలు, అనవసరమైన కొవ్వు పదార్ధాలు ఉండటం వల్ల ఇది ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది డయాబెటిస్‌కు కూడా దారితీస్తుంది. అలాగే వర్షాకాలంలో ఐస్ క్రీం తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. గొంతు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతే కాదు వర్షాకాలంలో ఐస్ క్రీం తినడం వల్ల మెదడులోని నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తలనొప్పి, దంత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఐస్ క్రీం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది ఊబకాయానికి కూడా దారితీస్తుంది. కాబట్టి మీకు చాలా ఇష్టం ఉన్నప్పటికీ వర్షాకాలంలో ఐస్ క్రీం తినకపోవడమే మంచిది.
మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్ చేయండి.








