AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Kashmir Tour: మంచు కురిసే వేళలో కశ్మీర్ టూర్ ఎంజాయ్ చేస్తారా? ఐఆర్‌‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే…

మంచు కురిసే వేళలో కశ్మీర్‌‌కు టూర్ వేయాలని చాలామందికి ఉంటుంది. అలాంటి వాళ్లు ఐఆర్ సీటీసీ అందించే కశ్మీర్ టూర్ ప్యాకేజీపై ఓ లుక్కేయొచ్చు. ‘మిస్టికల్ కశ్మీర్’ పేరుతో తీసుకొస్తున్న ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

IRCTC Kashmir Tour: మంచు కురిసే వేళలో కశ్మీర్ టూర్ ఎంజాయ్ చేస్తారా? ఐఆర్‌‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే...
Irctc Kashmir Tour
Nikhil
|

Updated on: Oct 31, 2025 | 5:07 PM

Share

‘మిస్టికల్‌ కశ్మీర్‌ ఎక్స్‌ హైదరాబాద్‌’ పేరుతో  ఐఆర్‌సీటీసీ వింటర్ ట్రిప్‌ను ప్లాన్ చేసింది. ఈ టూర్ నవంబర్ 13వ తేదీన మొదలవుతుంది. ఈ ట్రిప్ హైదరాబాద్‌ నుంచి స్టార్ట్ అవుతుంది. టూర్‌ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు ఉంటుంది. ఈ టూర్ లో భాగంగా హైదరాబాద్ నుంచి కశ్మీర్ కు ఫ్లైట్ ద్వారా చేరుకుంటారు. ఈ టూర్ లో విజిట్ చేసే ప్లేసులు, టూర్ ప్యాకేజీ ధరల వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రిప్ డీటెయిల్స్

ఈ ట్రిప్‌లో భాగంగా కశ్మీర్‌‌లోని దాల్ లేక్, ఫ్లోటింగ్ గార్డెన్స్, సోన్‌మార్గ్‌, తాజ్వాస్ గ్లేసియర్‌, శ్రీనగర్, గుల్‌మార్గ్‌, గోండోలా, పహల్గామ్‌, మొఘల్ గార్డెన్స్, చెష్మషాహి, పరిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్, హజ్రత్‌బల్‌ లాంటివెన్నో సందర్శించొచ్చు. వీటితోపాటు కశ్మీర్ లోయల మీదుగా రోప్ వే ప్రయాణం, రివర్ రాఫ్టింగ్, కనువిందు చేసే ఫ్లవర్ వ్యాలీస్, కుంకుమపువ్వు పంటలు, అవంతిపూర్ శిథిలాలు.. ఇలా కశ్మీర్‌‌లో చూడాల్సినవి, చేయాల్సినవి చాలానే ఉన్నాయి.

ప్యాకేజీ వివరాలు

ఈ ట్రిప్ ప్యాకేజీలో భాగంగా ఆరు రోజులు అల్పాహారం, రాత్రి భోజనం ఉచితంగా ఉంటుంది. త్రీ స్టార్‌ హోటల్‌లో స్టే ఉంటుంది. మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు, ప్లేసుల్లో ఎంట్రీ టికెట్లు, అడ్వెంచర్ యాక్టివిటీస్ వంటి వాటికి ఖర్చులు టూరిస్టులే చూసుకోవాలి. ఈ ప్యాకేజీ సింగిల్‌ షేరింగ్‌ ధర  రూ.45,100, ట్విన్‌ షేరింగ్‌ అయితే రూ.34,950, అదే  ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.33,510గా ఉంది. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌‌సీటీసీ వెబ్‌సైట్(irctctourism.com)ను విజిట్ చేయొచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి