సంక్రాంతి పండుగకు తప్పకుండా తినాల్సిన కర్రీ ఏదో తెలుసా?

అందరికీ ఇష్టమైన సంక్రాంతి పండుగ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ ఫెస్టివల్ రోజు ఎక్కడెక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉండే వారు కూడా, పల్లెటూర్లలోకి వచ్చి పండుగను ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఈ పండుగ రోజు తప్పకుండా కలగూర రెసిపీ వండుకొని తినాలంట.

Samatha J

|

Updated on: Jan 13, 2025 | 8:45 PM

అందరికీ ఇష్టమైన సంక్రాంతి పండుగ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ ఫెస్టివల్ రోజు ఎక్కడెక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉండే వారు కూడా, పల్లెటూర్లలోకి వచ్చి పండుగను ఎంజాయ్ చేస్తుంటారు.

1 / 5
పల్లెటూర్లలో ఉదయాన్నే ఇంటి ముందు రంగు రంగులతో ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి, కుటుంబ సభ్యులంతా గాలిపటాలు ఎగరవేస్తూ చాలా సంతోషంగా గడుపుతుంటారు. అంతే కాకుండా ఈ పండుగకు స్పెషల్‌గా కోడిపందాలు జోరుగా సాగుతాయి.

2 / 5
అయితే సంక్రాంతి వచ్చిందంటే చాలు తప్పకుండా పిండి వంటలు చేస్తుంటారు. ఇక వీటితో పాటు ఆనవాయితీగా వండాల్సిన కొన్ని వంటలు కూడా ఉంటాయంట. అందులో ముఖ్యమైనది కలగూర. సంక్రాంతి పండుగ రోజు ఖచ్చితంగా కలగూరను తినాలంట. అయితే ఈ రెసిపీని ఎలా చేస్తారోమనం ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
కలగూరలో మూడు రకాల ఆకుకూరలు చుక్క కూర, తోట కూర, మెంతి కూరతో పాటు వంకాయ,టమాట, ఉ్లల్లిపాయలు, శెనగపిండి, కొత్తి మీర తరగు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, పచ్చిమిర్చి,జీలకర్ర, పచ్చి శనగపప్పు, నూనె, ఎండు మిర్చి, ఆవాలు. వీటన్నింటితో కలగూరను వండుకోవాలంట.

4 / 5
కళాయి స్టవ్ మీద పెట్టి అందులో రెండు లేదా మూడు స్పూన్ల ఆయిల్ వేయాలి. తర్వాత అందులో పప్పుదినుసులు, ఉల్లిపాయలు, ఎండు మిర్చి, పచ్చిశనగపప్పును వేసి వేయించాలి. తర్వాత పసుపు , పచచిమిర్చి, కారం, రుచికి సరిపడ ఉప్పు, ధనియాల పొడి వేయాలంట. తర్వాత టమాటా గుజ్జు, కూరగాయల ముక్కలను వేసి కాస్త ఉడికించాలి. తర్వాత ఆకు కూరలు, చింత పండు వేసి బాగా కలపాలి. దీంతో కలగూర రెసిపీ రెడీ అయినట్లే. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట.

5 / 5
Follow us