Vitamin Deficiency: ఏ పని చేయకపోయినా ఆలసటగా అనిపిస్తుందా? అయితే మీ ఒంట్లో ఈ విటమిన్‌ లోపించినట్లే!

ఒక్కోసారి ఏ పని చేయకపోయినా విపరీతమైన నీరసంగా ఉంటుంది. దీంతో ఏ పనీ చేయలేక చతికిలపడిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక తికమక పడిపోతుంటారు. మీకూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే శరీరంలో ముఖ్యమైన విటమిన్లు లోపించినప్పుడు ఈ విధమైన సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు..

Srilakshmi C

|

Updated on: Jan 13, 2025 | 8:48 PM

చలికాలం వస్తే మార్కెట్లో రకరకాల నారింజ పండ్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కాలానుగుణ జలుబు, దగ్గు నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. శరీరంలో వివిధ రకాల విటమిన్ల అవసరం ఉన్నప్పటికీ.. వాటిల్లో విటమిన్ సి అగ్రస్థానంలో ఉంటుంది.

1 / 5
ఎముకల నిర్మాణం, రక్తనాళాల ఆరోగ్యం, గాయం నయం చేయడంలో విటమిన్ సీ శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కాకుండా, ఈ విటమిన్ శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి రక్తంలో తగినంత విటమిన్ సి ఉండటం చాలా అవసరం. శరీరంలో ఈ విటమిన్ లోపం ఉందంటే.. కొన్ని లక్షణాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అవేంటంటే..

2 / 5
విపరీతమైన అలసట - మీరు శారీరక శ్రమ లేకుండా కూడా అకస్మాత్తుగా చాలా అలసిపోయినట్లు అనిపిస్తే, రక్తంలో విటమిన్ సి స్థాయిని తనిఖీ చేసుకోవడం మంచిది. ఎందుకంటే విటమిన్ సి శరీరం కార్నిటైన్ అనే అణువును ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది.

3 / 5
థైరాయిడ్ సమస్య - విటమిన్ సి లేకపోవడం వల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. ఆకస్మిక హైపర్ థైరాయిడిజం లక్షణాలు వేగంగా బరువు తగ్గడం, ఆకలిని కోల్పోవడం, గుండె దడ వంటి సమస్యలను కలిగిస్తుంది.

4 / 5
చర్మ వ్యాధులు - విటమిన్ సి లేకపోవడం వివిధ చర్మ వ్యాధులకు కారణమవుతుంది. చర్మం మంట, దురద వంటి లక్షణాలు తలెత్తుతాయి. విటమిన్ సిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మానికి కొల్లాజెన్ ప్రోటీన్ ముఖ్యమైనది. అన్ని రకాల సిట్రస్‌ పండ్లలో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది.

5 / 5
Follow us