- Telugu News Photo Gallery Spiritual photos Shukra gochar in Meena Rashi 2025 These zodiac signs to have negative impacts details in telugu
Venus Transit: మీన రాశిలోకి శుక్రుడి.. ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
Shukra Gochar 2025: జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు భోగభాగ్యాలకు, సిరిసంపదలకు, సుఖ సంతోషాలకు కారకుడు. కళలు, నైపుణ్యాలకు కూడా శుక్రుడే కారకుడు. ఈ శుక్ర గ్రహానికి మీన రాశి ఉచ్ఛ రాశి. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకూ మీన రాశిలో శుక్ర సంచారం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారు అత్యధికంగా లాభాలు పొందబోతున్నప్పటికీ, మేషం, కర్కాటకం, సింహం, తుల, మీన రాశుల వారికి మిశ్రమ ఫలితాలు మాత్రమే అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు తన కారకత్వాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూనే కొన్ని సమస్యలు తీసుకు వచ్చే సూచనలున్నాయి.
Updated on: Jan 13, 2025 | 8:46 PM

మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల విలాసాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సుఖ సంతోషాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. విహార యాత్రలు, వినోద యాత్రలకు కూడా ఎక్కువ అవకాశం ఉంది. అనవసర పరిచయాలు, వ్యసనాలు చోటు చేసుకుంటాయి. పరిచయాలను, స్నేహ సంబంధాలను, అవకాశాలను దుర్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. మొత్తం మీద కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల భోగభాగ్యాలు వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది. సాధారణంగా విదేశీ ప్రయత్నాలు, విదేశీ అవకాశాలు అందినట్టే అంది చేజారిపోవడం జరుగుతుంది. అక్రమ సంబంధా లకు, అనవసర పరిచయాలకు ప్రాధాన్యం ఇచ్చే సూచనలున్నాయి. తండ్రితో అకారణ విభేదాలు తలెత్తవచ్చు. ప్రయాణాల వల్ల లాభం కలగకపోవచ్చు. తొందరపాటుతో వ్యవహరించే అవకాశం ఉంది.

సింహం: అష్టమ స్థానంలో శుక్రుడి ఉచ్ఛ సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆకస్మిక అధికార యోగా నికి బాగా అవకాశం ఉంది. అయితే, అనవసర పరిచయాలు, వ్యసనాలు కొద్దిగా వృద్ధి చెందే సూచ నలున్నాయి. బంధుమిత్రులతోనే కాకుండా జీవిత భాగస్వామితో సైతం అకారణ విభేదాలు తలె త్తడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. వృథా ప్రయాణాలతో ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో అపార్థాలు తప్పకపోవచ్చు.

తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఆరవ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఆకస్మిక ధన లాభం కలిగినా, అధికార యోగం పట్టినా అది తాత్కాలికమే అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బం దులు తలెత్తుతాయి. అనేక అవకాశాలు, ప్రయత్నాల వల్ల ఆదాయం పెరిగినప్పటికీ విలాసాల మీదా, మిత్రుల మీదా, కుటుంబం మీదా బాగా ఖర్చు పెట్టడం వల్ల ఆ తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి అనుకూలతలు తగ్గే ప్రమాదం కూడా ఉంది.

మీనం: ఈ రాశికి దుస్థానాధిపతి, పరమ పాపి అయిన శుక్రుడు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో బాగా ఇబ్బందులు కలుగుతాయి. ఆశించిన ప్రయోజనాలు నెరవేరకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు తప్పిపోయే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది.



