Kishan Reddy: సంక్రాంతి సంబరాలు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి ప్రధాని మోదీ, మెగాస్టార్ చిరంజీవి.. వీడియో

Kishan Reddy: సంక్రాంతి సంబరాలు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటికి ప్రధాని మోదీ, మెగాస్టార్ చిరంజీవి.. వీడియో

Shaik Madar Saheb

|

Updated on: Jan 13, 2025 | 6:17 PM

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.. ఈ సంక్రాంతి సంబరాల్లో బీజేపీ అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ప్రముఖులు హాజరుకానున్నారు..

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.. మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో భాగంగా.. భోగి మంటలతో పండుగ ప్రారంభమైంది.. పల్లెలతోపాటు.. పట్టణంలో ప్రజలు భోగి మంటలు వేసుకుని వేడుకలను మొదలు పెట్టారు. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులతో అలంకరించారు. ఈ క్రమంలో సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.. వేడుకల్లో భాగంగా ఆయన ఇంటి ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అతిథులకు రుచి చూపించేందుకు పలు రకాల సంప్రదాయ వంటకాలను సిద్ధం చేశారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో టీవీ9 వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు, రంజిత్ రావు, టీవీ9 హోల్టైమ్ డైరెక్టర్ హేమంత్ శర్మ పాల్గొన్నారు. వారితోపాటు బీజేపీ అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ప్రముఖులు హాజరయ్యారు.

ఇప్పటికే.. మెగాస్టార్ చిరంజీవి కిషన్ రెడ్డి ఇంట జరిగే సంక్రాంతి వేడుకల కోసం ఢిల్లీకి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు సైతం ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

Published on: Jan 13, 2025 05:17 PM