గడ్డకట్టే చలిలోనూ నగ్నంగానే నాగసాధువులు.. దీని వెనుక సైన్స్ రహస్యం ఇదే?
13 January 2025
TV9 Telugu
TV9 Telugu
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా పుష్యపౌర్ణమి రోజున అంటే జనవరి 13న ఘనంగా ప్రారంభమైంది. త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించేందుకు దేశనలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు
TV9 Telugu
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. అయితే ఈ మహా కుంభమేళాలో అందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం మహా కుంభమేళాకు హాజరైన నాగసాధువులు. ముఖ్యంగా నాగసాధువులు బట్టలు ధరించకున్నా గడ్డకట్టే చలిలోనూ తట్టుకుని ఎలా నిలబడతారనేది ప్రతి ఒక్కరికీ వచ్చే సందేహం
TV9 Telugu
అసలు నాగ సాధువులు ఎందుకు వస్త్రాలు ధరించరు? మైనస్ డిగ్రీల చలినీ సహించగల శక్తి నాగసాధవులకు ఎక్కడి నుంచి వచ్చింది? శరీరానికి బూడిద పూసుకుని, ఒంటిపై నూలు పోగు లేకుండా ఎలా జీవనం సాగిస్తారు? దీని వెనుక రహస్యమేమంటే..
TV9 Telugu
నాగ సాధువులు ప్రకృతికి, సహజ స్థితికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే నాగ బాబా కప్డే ధరించరు. ఎవరైనా ప్రపంచంలోకి నగ్నంగా వస్తాడని, ఈ స్థితే సహజమని నాగ సాధువులు నమ్ముతారు. ఈ భావన వల్ల నాగ సాధువులు దుస్తులు ధరించరు
TV9 Telugu
అలాగే శరీరంపై బూడిదను పూయడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షించబడతారని భావిస్తారు. ఈ కారణాల వల్ల, నాగ సాధువులు తమ శరీరాలను బూడిదతో కప్పుకుని నగ్నంగా ఉంటారు
TV9 Telugu
నాగ సాధువులు ప్రాపంచిక అనుబంధాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉంటారు. వీరు భగవంతుని ఆరాధించడంలో తనను తాను నిమగ్నం చేసుకుంటారు. అందుకే వీరికి బట్టల పట్ల శ్రద్ధ ఉండదు
TV9 Telugu
ఎవరైనా దుస్తులు లేకుండా మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ వద్ద సుమారు 2.5 గంటలు మాత్రమే జీవించగలరు. దుస్తులు ధరిస్తే 15 గంటల వరకు జీవించగలరు. అదే నాగ సాధువులు ఈ సైన్స్ లెక్కలకు విరుద్ధంగా విపరీతమైన చలిని తట్టుకోగలగడనికి కారణం వారి రహస్య ఆధ్యాత్మిక అభ్యాసాలే కారణం
TV9 Telugu
అన్ని రుతువులను తట్టుకోవడానికి నాగసాధువులు 3 రకాల సాధనలను చేస్తారు. అగ్ని సాధన, నాడీ శోధన, మంత్ర పఠనం.. వంటి 3 రకాల సాధనలు చేయడం ద్వారా ప్రకృతి మార్పులకు సహజ సిద్ధంగా తమ శరీరం తట్టుకునేలా తయారవుతారు