Brown Egg vs White Egg: గోధుమ.. తెలుపు.. ఏ రంగు కోడిగుడ్లు ఎక్కువ పోషకమైనవో తెలుసా?

కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో అధిక మొత్తంలో ప్రొటీన్ ఉంటుంది. అంతేకాకుండా రోజువారీ శరీరానికి కావల్సిన పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అయితే మార్కెట్లో మనకు గోధుమ రంగు, తెలుపు రంగులో రెండు రకాల కోడి గుడ్లు కనిపిస్తాయి. వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? వేటిని కొనుగోలు చేయాలనే సంశయం మనలో చాలా మందికి వస్తుంది..

Srilakshmi C

|

Updated on: Jan 13, 2025 | 8:33 PM

సాధారణంగా మార్కెట్‌లో 2 రంగుల కోడి గుడ్లు అందుబాటులో ఉంటాయి. తెల్లటి షెల్ గుడ్డు. మరొకటి గోధుమ రంగు. కోళ్లు గోధుమ రంగు గుడ్లు ఎందుకు పెడతాయో? వీటిలో ఏ రంగు గుడ్లు మంచివో? ఎక్కువ పోషకాలు ఎందులో ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
చాలా మంది అభిప్రాయం ప్రకారం, గోధుమ రంగు గుడ్లు మరింత పోషకమైనవి. ఎందుకంటే అవి ఖరీదైనవి కాబట్టి చాలా మంది అంటుంటారు. నిజానికి.. గుడ్డు రంగు కోడి జాతి, జన్యువులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తెల్ల రెక్కలున్న కోళ్ల గుడ్లు తెల్లగా ఉంటాయి. ముదురు రంగు ఈకలు కలిగిన కోడి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. కొన్నిసార్లు తెల్ల కోళ్లు కూడా గోధుమ రంగు గుడ్లు పెడతాయి. గుడ్డు పెంకు యొక్క గోధుమ రంగు ప్రధానంగా కోడి గర్భాశయంలోని కణ గ్రంధుల కారణంగా ఉంటుంది.

2 / 5
సాధారణంగా గుడ్లు, మాంసం ఉత్పత్తి కోసం పెంచే గోధుమ కోళ్లు గోధుమ రంగు గుడ్లు పెడతాయి. ఈ కోళ్లు పరిమాణంలో పెద్దవి కావడంతో ఎక్కువ మేత అవసరం. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి వ్యయం ఎక్కువ. ఇక ఫౌల్ట్రీ కోళ్లు సంతానోత్పత్తి కొంత చౌకగా ఉంటుంది. బ్రౌన్ కోళ్ల కంటే వాటికి తక్కువ మేత అవసరం. అందుకే తెల్ల కోడిగుడ్ల ధర గోధుమ కోడిగుడ్ల కంటే కాస్త తక్కువ.

3 / 5
గుడ్డు రంగులో వైవిధ్యం కారణంగా పోషకాల వ్యత్యాసం ఉందా? అంటే పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, రంగులో వైవిధ్యం ఏ గుడ్డును ఎక్కువ లేదా తక్కువ పోషకమైనదిగా చేయదు. రెండు రంగుల గుడ్ల ఆహార నాణ్యత దాదాపు సమానంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా రంగు గుడ్లు సురక్షితంగా తినవచ్చు. కోళ్లు ఎలాంటి ఆహారం తింటున్నాయో, ఏ వాతావరణంలో పెరుగుతున్నాయి అనేది మాత్రం ముఖ్యం.

4 / 5
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, పౌష్టికాహారం కోసం మేతగా ఉండే కోళ్ల గుడ్లలో సహజంగానే ఎక్కువ విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, కొవ్వు ఉంటాయి. మరోవైపు, ఫారమ్ కోడి గుడ్లలో ఈ విటమిన్లు, ఖనిజాలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, వాటిలో ప్రోటీన్లు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. పౌల్ట్రీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశీయ కోళ్లు ఎక్కువ సూర్యరశ్మికి గురవుతాయి. ఎందుకంటే వాటి గుడ్లలో ఎక్కువ విటమిన్లు A, E ఉంటాయి. అందుకే ఫాంలో పెంచే కోడి గుడ్ల కంటే పొలం-పెంపకం కోడి గుడ్లు ఎక్కువ పోషకమైనవి.

5 / 5
Follow us