కొంత మందికి స్పైసీ ఫుడ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. అందుకే వారు ఇంట్లో అయినా సరే, బయటకు వెళ్లి తినేటప్పుడు స్పైసీగా చేయండి అంటూ చెప్తుంటారు.
అయితే ఇలా ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన ఆయుష్షు తగ్గిపోయే ఛాన్స్ ఉన్నదంట. ఇక ఈ మధ్య యూరోపియన్ దేశాల్లో స్పైసీగా ఉండే రామన్ నూడుల్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.
దీని కారణం స్పైసీ ఫుడ్ తీసుకోవడ వలన ఒక వ్యక్తి అనారోగ్య సమస్యల బారిన పడి మరణించడమే, ఇక కారం ఎక్కువ తీసుకోవడం వలన చాలా మందిలో అనేక ఇబ్బందులు వస్తా యి.
కొందరు చప్పగా తిని, ఒకటి లేదా రెండు రోజులు స్పైసీ ఫుడ్ తినడం వలన ఛాతిలో మంట, విరేచనాలు కావడం,వికారం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
అంతే కాకుండా ఎక్కువ కారం ఉన్న ఫుడ్ తీసుకోవడం వలన శరీరం అంతా వేడిగా అనిపించడం, చెమటలు రావడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం, పొట్టలో నొప్పి వంటి సమస్యలు మొదలు అవుతాయి. అందు వల్ల అస్సలే స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు.