పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులివే!

samatha

11 January 2024

చిన్న పిల్లల మనసు చాలా స్వచ్ఛమైనది అంటారు. వారు తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న వారు ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు.

అందువలన చిన్నపిల్లలు ముఖ్యంగా నాలుగు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వయసు ఉన్న పిల్లల తల్లిదండ్రుల చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట.

 పిల్లల ముందు తల్లిదండ్రులు కొన్ని పనులను అస్సలే చేయకూడదంట. అవి ఏవో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

 తమ పిల్లలు చూస్తున్న సమయంలో తల్లిదండ్రులు గొడవ పడటం, గట్టిగా అరవడం అస్సలే చేయకూడదంట. దీని వలన వారు మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది.

కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు చూస్తున్నారు, వారిని గమనిస్తున్నారని మర్చిపోయి, టీచర్స్, ఇతరుల గురించి చాలా తప్పుగా మాట్లాడుతారు. అలా చేయకూడదు.

ఎందుకంటే అది వారి మనసులో ప్రతి కూల ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ చెడుగా మాట్లాడకూడదు.

ప్రతి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండటం అనేది చాలా కామన్. అయితే తల్లిదండ్రులు తమ పిల్లల ముందు ఆర్థికపరమైన సమస్యల గురించి చర్చించకూడదంట. దీని వలన వారు మానసిక ఒత్తిడికి లోను అవుతారు.

 ప్రతి పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచే ప్రతీది నేర్చుకుంటారు అందువలన మీరు ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వడం, ఇతరుల పట్ల సానుకూలంగా మాట్లాడటం చేయాలి. లేకపోతే మీ పిల్లలపై ప్రభావం చూపుతుందంట.