వామ్మో.. చలి ఎక్కువగా ఉందని స్వెటర్ వేసుకొని నిద్రపోతున్నారా?
13 January 2025
samatha
ప్రస్తుత చలి పంజా విసురుతుంది. సాయంత్రం ఆరు అయిందంటే చాలు చలి మొదలు అవుతుంది. దీంతో చాలా మంది స్వెటర్ వేసుకోవడం చేస్తున్నారు.
అయితే శీతాకాలంలో స్వెటర్ ధరించడం, స్వెటర్ వేసుకొని నిద్ర పోవడం అనేది చాలా కామన్. కానీ ఇలా స్వెటర్ వేసుకొని నిద్ర పోవడంవలన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందంట.
శీతకాలంలో రాత్రి సమయంలో స్వెటర్ ధరించడం ఆరోగ్యానికి హానికరం, మరీ ముఖ్యంగా స్వెటర్ వేసుకొని అస్సలే నిద్రించకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చలి ఎక్కువ ఉన్నదని రాత్రిపూట స్వెటర్ ధరించడం వలన మన శరీరంలో ఉండే అధిక వేడి పోతుందంట. ఇది దుద్దుర్లు రావడం, చర్మం పొడిబారేలా చేస్తుందంట.
అంతే కాకుండా చిన్నపిల్లలు దీని కారణంగా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. అలాగే స్వెటర్ వేసుకొని నిద్ర పోవడం వలన రక్తపోటు తగ్గిపోయి, తల తిరగడంవంటి సమస్యలు తలెత్తుతాయంట.
అలాగే గుండె జబ్బులు ఉన్న వారు బిగుతుగా ఉండే స్వెటర్ వేసుకొని నిద్రపోవడం వలన ఛాతీ భాగంలో ఇబ్బంది అనిపించి శ్వాస సమస్యలు ఎదుర్కొంటారంటున్నారు వైద్యులు.
అదే విధంగా ఎవరైతే ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వారు అస్సలే రాత్రి సమయంలో స్వెటర్ ధరించకూడదంట, అందులో ఉండే అలెర్జీ కారకాల వలన శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తుతాయి.
మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేసి అలసిపోతాము, అందుకు మన శరీరానికి కాస్త విశ్రాంతి అవసరం. అందువలన మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి స్వెటర్‌ను ధరించకూడదంట.