కార్చిచ్చును తట్టుకుని.. హాలీవుడ్‌లో కుమ్మేస్తున్నబాలయ్య

కార్చిచ్చును తట్టుకుని.. హాలీవుడ్‌లో కుమ్మేస్తున్నబాలయ్య

Phani CH

|

Updated on: Jan 14, 2025 | 3:37 PM

ఇప్పుడు తెలుగు సినిమాలకు USA ఓ పెద్ద మార్కెట్‌ గా మారింది. మన ప్రొడ్యూసర్ల జేబులను కాస్త గట్టిగానే నింపుతోంది. ఇక ఇప్పుడు బాలయ్య లేటెస్ట్ రిలీజ్ డాకు మహారాజ్ కూడా ఇదే చేసింది. ఓ పక్క కార్చిచ్చుతో లాస్‌ ఏంజిల్స్ రగిలిపోతున్నా.. ఇంకో పక్క మంచు తుఫానుతో అమెరికావణికిపోతున్నా... డాకు మహారాజ్‌ మూవీ మాత్రం యూఎస్‌ఏలో బిగెస్ట్‌ ఓపెనింగ్స్‌ను రాబట్టింది.

ఇదే ఇప్పుడు తెలుగు ఫిల్మ్ పెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన బాలయ్య డాకు మహారాజ్‌ సినిమా.. హాలీవుడ్‌ గడ్డపై తొలిరోజే సెన్సెషనల్ ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజే యూఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అమెరికాలో రిలీజ్‌ డే ఒక్కరోజే 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది బాలయ్య మూవీ. ఇక ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దాంతో పాటే.. ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ గడ్డ పై బాలయ్య సినిమా దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టడం పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గేమ్ ఛేంజర్ సినిమాపై కుట్ర.. పోలీస్‌ స్టేషన్లో కేసు

పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు.. ఇమ్యూనిటీని పెంచుకోండి ఇలా !!

ఏ వయసు వారు రోజూ ఎంత దూరం వాకింగ్​ చేయాలి

అబ్బాయిలూ ఇలా రెడీ అవండి.. చాలా స్పెషల్‌గా కనిపిస్తారు..