అబ్బాయిలూ ఇలా రెడీ అవండి.. చాలా స్పెషల్‌గా కనిపిస్తారు..

అబ్బాయిలూ ఇలా రెడీ అవండి.. చాలా స్పెషల్‌గా కనిపిస్తారు..

Phani CH

|

Updated on: Jan 14, 2025 | 3:06 PM

ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికే సమయం ఉండటం లేదు. ఇక డ్రెస్ సెన్స్‌ పాటించే సమయం ఎక్కడుంటుంది? చాలా మంది యువకులు డ్రెస్‌ సెన్స్‌ ఉన్నా సమయం లేక ఏది దొరికితే అది వేసుకొని ఆఫీసులకు వెళ్తుంటారు. కొందరికి పాపం నిజంగానే డ్రస్‌ సెన్స్‌ తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఏ బట్టలు వేసుకుంటారో..వాటిపై ఎలాంటి షూ ధరిస్తారో.. చూసుకోకుండానే అన్ని చోట్లకు వెళ్తుంటారు.

ఇలా వెళ్లడం వల్ల మీకు సరైన మర్యాద దక్కక పోవచ్చు. లేదా అక్కడ మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు. అలాంటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాకాకుండా అందరి చూపూ మీపై నిలపాలంటే చిన్నపాటి టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. నేటి ఫ్యాషన్ ప్రపంచంలో కాలంతో పాటు ప్రతిదీ మారుతుంది. మార్కెట్‌లో సందడి చేస్తున్న రకరకాల స్టైలిష్‌ దుస్తులతో పాటు వాటికి సరిగ్గా మ్యాచ్‌ అయ్యే షూస్ కూడా వేసుకోవాలి. అప్పుడే లుక్‌ బావుంటుంది. ముఖ్యంగా మగవాళ్లకు ఇలాంటి చిన్న చిన్న మార్పులు కొత్త లుక్‌ ఇస్తాయి. కొంతమంది అన్ని రకాల దుస్తులకు ఒకే జత బూట్లు ధరిస్తారు. మ్యాచింగ్ షూస్ వేసుకోకుంటే ఎంత మంచి డ్రెస్‌ వేసుకున్నా లుక్‌ మారిపోతుంది. డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన ఖరీదైన దుస్తులకు విలువ లేకుండా పోతుంది. అందుకే ధరించే దుస్తులను బట్టి షూస్ ఎంచుకోవడం చాలా ముఖ్యం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సఫారీలో షాకింగ్ ఘటన.. జీప్‌లో నుంచి పడిపోయిన తల్లీకూతుళ్లు

ఈ ఫుడ్ తింటే.. వైరస్‌లు మీ జోలికి రావు..

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూసే అరటి పువ్వు

ఆ నిర్ణయాల్లో మానవుల కన్నా చీమలే బెటర్ !​!

డాకు మహారాజ్‌పై రాజమౌళి తనయుడి రివ్యూ