అరటి పువ్వు వారినికోసారి తిన్నా చాలు.. ఈ రోగాలు మటుమాయం
అరటి పండు మాత్రమే కాదు.. అరటి పువ్వు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటి పువ్వులో శరీరానికి కావాల్సిన ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఇ, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ కారణంగా అరటి పువ్వు అనేక వ్యాధులతో పోరాడటానికి ఉపయోగపడుతుంది. అరటి పువ్వులో నెఫ్రో ప్రొటెక్టివ్ యాక్టివిటీ ఉంది. ఇది కిడ్నీ దెబ్బ తినకుండా కాపాడుతుంది.
అరటి పువ్వు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయ పడతాయి. అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి అరటి అద్భుత మేలు చేస్తుంది. అరటి పువ్వును ఆహారంలో భాగంగా చేసుకుంటే.. యాంటీ హైపర్‌టెన్సివ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించగలదు. ఇందులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు అనేక వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ నిర్ణయాల్లో మానవుల కన్నా చీమలే బెటర్ !!
డాకు మహారాజ్‌పై రాజమౌళి తనయుడి రివ్యూ
Prabhas: ప్రభాస్ సీక్రెట్‌గా దాచుకున్న పెళ్లి మ్యాటర్
ఫ్యాన్స్ అసహనం.. దీంతో మేకర్స్ తీసుకున్నారు బంపర్ డెసిషన్
TOP 9 ET News: డాకు మహారాజ్ బంపర్ హిట్.. డే1 దిమ్మతిరిగే కలెక్షన్స్