AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala News: తిరుమల పరకామణి చోరీ కేసు కీలక మలుపు.. వెలుగులోకి సంచలన విషయాలు

తిరుమల పరకామణిలో బంగారం బిస్కెట్‌ చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. మొన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ దొంగిలిస్తూ దొరికి పోయిన పెంచలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఇదే కాకుండా గతంలోనూ బంగారు బిస్కెట్లను గుట్టుచప్పుడు కాకుండా తస్కరించినట్లు సమాచారం.

Tirumala News: తిరుమల పరకామణి చోరీ కేసు కీలక మలుపు.. వెలుగులోకి సంచలన విషయాలు
Parakamani Gold Biscuit Theft
Balaraju Goud
|

Updated on: Jan 14, 2025 | 12:26 PM

Share

తిరుమల తిరుపతి దేవస్థానం పరకాణిలో బంగారం బిస్కెట్ చోరీ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇటీవల 100 గ్రాముల బంగారం బిస్కెట్ దొంగిలిస్తూ దొరికిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్యను తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోల్డ్ బిస్కెట్‌ను ట్రాలీలో దాచి చోరీ చేసేందుకు ప్రయత్నించగా టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. దీంతో తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు పెంచలయ్య ఇదే కాకుండా గతంలోనూ బంగారు బిస్కెట్లను గుట్టుచప్పుడు కాకుండా తస్కరించినట్లు సమాచారం.

తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో రెండేళ్లుగా పని చేస్తున్నాడు. అగ్రిగోస్ కంపెనీ ద్వారా నియమితులైన పెంచలయ్య పక్కా ప్రణాళికతోనే పరకాణిలో ఉద్యోగం సంపాదించాడు. ఈజీ మనీకి అలవాటు పడ్డ పెంచలయ్య పరకామణిలోని గోల్డ్‌ స్టోరేజ్‌ గదిలో దాచిన బంగారు వస్తువులను దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. పెంచలయ్య తీరుపై అనుమానం రావడంతో టీటీడీ విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే జనవరి 11న మధ్యాహ్నం గోల్డ్‌ స్టోరేజ్‌ గదిలో ఉన్న 100 గ్రాముల బిస్కెట్‌ కనిపించకుండాపోయింది. దీంతో తనిఖీల్లో భాగంగా సీసీ కెమెరా పుటీజీలు పరిశీలించగా, దొంగిలించిన బంగారు బిస్కెట్‌ను ట్రాలీకి ఉన్న పైపులలో దాచి తరలిస్తున్న పెంచలయ్య కనిపించాడు. భద్రతా సిబ్బంది ఆరా తీస్తుండగానే నిందితుడు పెంచలయ్య అక్కడి నుంచి పారిపోయాడు. ఎట్టకేలకు నిందితుడు పెంచలయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి రూ.46 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తిరుమల వన్ టౌన్ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.

విజిలెన్స్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెంచలయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. పరకామణిలో గతంలోనూ బంగారు, వెండి వస్తువులను చేసిన చోరీ చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అతని నుంచి 555 గ్రాముల బంగారు బిస్కెట్‌లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ సుమారు రూ.46లక్షలు ఉంటుందని అంచనా. నిందితుడి నుంచి వస్తువును రికవరీ చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..