సఫారీలో షాకింగ్ ఘటన.. జీప్‌లో నుంచి పడిపోయిన తల్లీకూతుళ్లు

సఫారీలో షాకింగ్ ఘటన.. జీప్‌లో నుంచి పడిపోయిన తల్లీకూతుళ్లు

Phani CH

|

Updated on: Jan 13, 2025 | 4:29 PM

జంతు ప్రేమికులు వన్య మృగాలను దగ్గర నుంచి చూడాలని సఫారీకి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఏనుగులు, పులులు, సింహాలను దగ్గరనుంచి చూస్తూ ఎంతో ఎంజాయ్‌ చేస్తుంటారు. అలా సఫారీకి వెళ్తున్న వాహనంలోంచి తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఇంతలో అక్కడే ఉన్న ఖడ్గమృగం వారివైపు పరుగు పరుగున రావడంతో భయంతో వారు కేకలు వేశారు.

ఈ ఘటన అస్సాంలోని కజిరంగా నేషనల్‌ పార్క్‌లో చోటుచేసుకుంది. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ ఖడ్గమృగాలకు నిలయం. ఇక్కడి స్పెష‌ల్‌ జీప్ సఫారీ రైడ్ సందర్శకులకు ఖడ్గమృగాలు, ఇతర జంతువులను చూసే అవకాశాన్ని క‌ల్పిస్తుంది. సంద‌ర్శకులు జీప్ స‌ఫారీ చేస్తున్న స‌మయంలో త‌ల్లీకూతుళ్లు ప్రమాద‌వ‌శాత్తు అందులోంచి కింద ప‌డిపోయారు. అప్పటికే జీపు వెనుకవైపు ఓ ఖ‌డ్గమృగం త‌రుముకుంటూ వ‌స్తోంది. ఇక ఆ జీపు ప‌క్కవైపు నుంచే మ‌రో ఖ‌డ్గమృగం వెళుతోంది. దాంతో కింద‌ప‌డ్డ ఇద్దరు భయంతో సహాయం కోసం కేకలు వేశారు. వెంటనే అప్రమ‌త్తమైన ప‌ర్యాట‌కులు వారిని కాపాడారు. దాంతో త్రుటిలో వారిద్దరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన కజిరంగా నేషనల్ పార్క్‌లోని బగోరి పరిధిలో జరిగినట్లు సమాచారం. ఓ పర్యాటకుడు ఈ భయానక సంఘటనను త‌న‌ కెమెరాతో చిత్రీక‌రించాడు. ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో పెట్టడంతో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ఫుడ్ తింటే.. వైరస్‌లు మీ జోలికి రావు..

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూసే అరటి పువ్వు

ఆ నిర్ణయాల్లో మానవుల కన్నా చీమలే బెటర్ !​!

డాకు మహారాజ్‌పై రాజమౌళి తనయుడి రివ్యూ

Prabhas: ప్రభాస్ సీక్రెట్‌గా దాచుకున్న పెళ్లి మ్యాటర్