ఈ ఫుడ్ తింటే.. వైరస్‌లు మీ జోలికి రావు..
చలికాలం మొదలైంది. వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయి. 2020లో ఒక్కసారిగా ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా మహమ్మారి. లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఏదోలా ఈ వైరస్‌ను ఎదుర్కొన్నా పోస్ట్ కోవిడ్ రూపంలో దాని ప్రభావం మనుషులపై తీవ్రంగా పడింది. ఇప్పుడు మరో కొత్త వైరస్ మానవాళిపై పంజా విసురుతోంది. చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్ కలకలం రేపింది.
దీనిగురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్రం ప్రకటించిన గంటల వ్యవధిలోనే భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరు, గుజరాత్‌లో హెచ్‌ఎంపీవీ వైరస్‌లు బయటపడ్డాయి. ఈ క్రమంలో మరోసారి మన శరీరంలోని ఇమ్యూనిటీ గురించి చర్చ మొదలైంది. వైరస్‌లను ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి కీలకమైంది. ఇప్పుడు దీనిని మన శరీరంలో పెంచుకునేదెలా? సహజంగా శరీరంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలేంటి అనేదిశగా సెర్చ్ మొదలైంది. వివిధ రకాల వైరస్‌ల నుంచి సంరక్షించుకోవాలంటే ఇమ్యూనిటీ చాలా అవసరం. ఈ రోగనిరోధక శక్తి విటమిన్ సి ద్వారా శరీరానికి అందుతుంది. కానీ రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి మాత్రమే సరిపోదంటున్నారు నిపుణులు. ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉండే సమతుల ఆహారం తీసుకోవడం అవసరం. అంతే కాకుండా.. తగినంత నిద్ర, వ్యాయామం కీలకం. ఒత్తిడికి గురికాకూడదన్నది వైద్యుల ప్రధాన సలహా. సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని సూచిస్తున్నారు. శరీరం చురుగ్గా ఉండాలంటే సూక్ష్మ పోషకాలు అవసరం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూసే అరటి పువ్వు
ఆ నిర్ణయాల్లో మానవుల కన్నా చీమలే బెటర్ !!
డాకు మహారాజ్‌పై రాజమౌళి తనయుడి రివ్యూ