ఉలవల్లో తక్షణ శక్తినిచ్చే సుగుణాలూ ఎక్కువ. పోషకాహార లోపం ఉన్నవారు ఉలవలను క్రమం తప్పక తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు అధికంగా లభిస్తుంది. జీర్ణశక్తి మెరుగుదలకు ఉలవలు చాలా మంచిది.