పుదీనాతో విటమిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. పుదీనా ఆకుల్లోని విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. పుదీనాలో ఐరన్, మాంగనీస్, ఫోలేట్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీవక్రియ విధులు, కణాల పెరుగుదలకు తోడ్పడతాయి.