Chiluka Thotakura: ఇదేదో పిచ్చి మొక్క అనుకునేరు.. పవర్‌ఫుల్.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
మానవ శరీరానికి ప్రకృతికి అవినావ భావ సంబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే మానవాళికి జీవనాడి ప్రకృతి. ఆరోగ్యం, ఆహారం, మానవ శ్రేయస్సు మొత్తం ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. అందుకనే ప్రకృతిలో లభించే ఆహారాన్ని అందునా ఏ కాలంలో దొరికే ఆహారం ఆయా కాలాల్లో తినడం ఆరోగ్యకరమని ఆయుర్వేదం పేర్కొంది. అంతేకాదు ప్రకృతి ఓ మెడికల్ షాప్.. ఇక్కడ మనం పిచ్చి మొక్కలు అని పట్టించుకోని అనేక మొక్కలలో రకరకాల వ్యాధిని నివారించే ఔషధ గుణాలున్నాయి. అలాంటి మొక్క ఒకటి చిలుక తోటకూర. దీనినే మొక్క తోట కూర అని కూడా అంటారు.
ప్రకృతిలోని రకరకాల మొక్కలలో ఔషధ గుణాలున్నాయి. వీటిని ఉపయోగించి అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేదం పేర్కొంటుంది. అలాంటి కొన్ని మొక్కలను పిచ్చి మొక్కలని పట్టించుకోకుండా వదిలేస్తారు. పిచ్చి మొక్కగా భావించే మొక్కలలో చిలుక తోటకూర ఒకటి. దీనిని మొక్క తోటకూర, పిచ్చి తోటకూర అని కూడా అంటారు. చేల గట్ల వెంట మాత్రమే కాదు పల్లెల్లో, పట్టణాల్లో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ కనిపించే మొక్క చిలుక తోటకూర. దీనిని స్పెషల్ గా పెంచాల్సిన పనిలేదు. ఎక్కడ బడితే అక్కడ వాటంతట అవే పెరుతాయి. పూర్వకాలంలో దీనిని కూరగా చేసుకుని తినేవారు. ఈ రోజు ఈ చిలుక తోటకూరలోని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
- శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా చిలుక తోటకూర చేస్తుంది. ఈ చిలుక తోటకూరలో అధిక మొత్తంలో ఫైబర్, కార్బొహైడ్రేట్స్, కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం, పాస్పరస్ వంటి అనేక రకాల పోషకాలున్నాయి.
- ఈ చిలుక తోటకూరని తరచుగా తినడం వలన ముఖ్యంగా శరీరంలో వేడి తత్వం ఉన్నవారు తినడం వలన శరీరంలోని వేడి తగ్గి చలువ చేస్తుంది. చిలుక తోటకూరని తినడం వలన వైరస్, బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల బారిన పడరు.
- ఫైల్స్ సమస్యతో బాధపడేవారికి చిలుక తోటకూర బెస్ట్ రెమెడీ. ఈ ఆకులను తీసుకుని పేస్ట్ గా చేసి రాత్రి మొలలపై అప్లై చేసి ఉదయం కడగాలి. ఈ ఇలా క్రమం తప్పకుండా చేస్తే మొలలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
- పిచ్చి తోటకూర మొక్క విరిగిన ఎముకలను అతికించే గుణం కలిగి ఉన్నాయి. ఎముకలు విరిగిన చోట ఈ ఆకుల పేస్ట్ వేసి కట్టు కట్టాలి. ఈ ఆకుల రసానికి ఉప్పుని కలిపి తాగడం వలన విరిగిన ఎముకలు అతుక్కుంటాయి.
- ఎవరైనా అతిసార వ్యాధితో బాధపడుతుంటే చిలుక తోట కూర మొక్కని శుభ్రం చేసి నీటిలో వేసి మరిగించి.. ఆ నీటిని ఒక గ్లాస్ తాగితే అతిసార వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీరు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా అయ్యేలా చూస్తుంది.
- మూత్రంలో మంట సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి ఈ పిచ్చి తొతకూర మొక్క వేరు మంచి ఔషదం. ఈ వేర్లను దంచి రసం తీసి పావు స్పూన్ మోతాదులో రోజూ తాగుతూ ఉంటె ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
- పిచ్చి తోటకూర కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఎండబెట్టి చిలుక తోటకూర విత్తనాలు, ఎండిన అంజీరా పండును, పటిక బెల్లం తీసుకుని వీటిని బాగా దంచి పొడిగా చేసుకుని ఒక గాజు గ్లాస్ లో నిల్వ చేసుకోవాలి. రోజూ రెండు సార్లు ఒక కప్పు నీటిలో ఈ పొడిని 15 గ్రాముల మోతాదులో వేసి తాగుతుంటే దృష్టి మెరుగుపడుతుంది.
- మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ చిలుక తోట కూరని కూరగా చేసుకుని తింటే సమస్య తగ్గుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది.
- చర్మం పై కురుపులు,గజ్జి వంటి సమస్య ఉంటే ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి లేపనంగా రాయడం వల్ల ఫలితం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)