AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్ర లేచిన వెంటనే నల్ల పిల్లి కనిపిస్తే మంచా.. చెడ్డదా .. రోజు ఎలా ఉంటుందంటే

విదేశీయులు కుక్కలను, పిల్లులని పెంచుకుంటారు. అయితే భారతీయులు మాత్రం కుక్కని సొంత ఇంటి పిల్లలా పెంచుకుంటే.. పిల్లిని మాత్రం పెచుకోవడానికి ఇష్టపడరు. పైగా పిల్లి కనిపిస్తే చాలు ఆశుభంగా భావిస్తారు. ఇక నల్ల పిల్లి అంటే చాలు అరిష్టం అని పెద్దలు చెబుతారు. అందుకనే పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే పిల్లి ని చూడడం.. లేదా ఎక్కడికైనా బయటకు వెళ్తున్న సమయంలో పిల్లి ఎదురు రావడం ఆశుభంగా భావిస్తారు. ఈ నేపధ్యంలో ఈ రోజు నల్ల పిల్లి కనిపిస్తే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం..

నిద్ర లేచిన వెంటనే నల్ల పిల్లి కనిపిస్తే మంచా.. చెడ్డదా .. రోజు ఎలా ఉంటుందంటే
Black Cat
Surya Kala
|

Updated on: Jan 14, 2025 | 3:12 PM

Share

నల్ల పిల్లి గురించి వినగానే అద్భుతం, అరిష్టం వంటి రకరకాల విషయాలు గుర్తుకు వస్తాయి. వెళ్తున్న దారిలో నల్ల పిల్లి ఎదురు వచ్చినా.. నిద్ర లేచిన వెంటనే నల్ల పిల్లిని చూసినా ఆశుభమని చాలా మంది నమ్ముతారు. అందుకనే నల్ల పిల్లి కనిపిస్తే ఎంత ఆర్జేంట్ పని మీద బయటకు వెళ్ళేవారు అయినా సరే ఆగిపోతారు, అంతేకాదు నల్ల రంగు పిల్లి రోడ్డు దాటితే అది అశుభం. అలా ఒక నల్ల పిల్లి రోడ్డు దాతున్న సమయంలో ఎవరైనా కాసేపు ఆగి తర్వాత మంచి నీరు తాగి మళ్ళీ బయలు దేరతారు. అయితే ఇంట్లో అకస్మాత్తుగా నల్ల పిల్లి కనిపిస్తే ఏమవుతుంది అనే విషయంపై వాస్తు సలహాదారు హితేంద్ర కుమార్ శర్మ పలు విషయాలను తెలిపారు.

  1. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత నల్ల పిల్లిని చూడటం అశుభం కాదని చెప్పారు. నిద్ర లేవగానే నల్ల పిల్లి కనిపిస్తే అది అతిథుల రాకకు సూచన.. అంతేకాదు పాత స్నేహితుడిని కలవనున్నారని కూడా సూచిస్తుంది.
  2. ఒక నల్ల పిల్లి ఇంట్లోకి చొరబడి తనంతట తానుగా వెళ్లిపోతే, అది ఆ వ్యక్తికి అదృష్టానికి సంకేతం. ఈ సందర్భంలో ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.
  3. నల్ల పిల్లి ఏదైనా ఆరోగ్య సమస్యలతో ఉన్నది అయితే.. అది ఇంటిలో ఇబ్బందులు రానున్నాయని సూచన. కుటుంబ సభ్యుల మధ్య కూడా సమస్యలు తలెత్తనున్నాయని హెచ్చరిక.
  4. నల్ల పిల్లుల గురించి ఎక్కువగా ఉన్న నమ్మకం..అవి అశుభమైనవిగా పరిగణించబడుతున్నాయి. 3000 BC లోనే నల్ల పిల్లులకు కొంత ఆధ్యాత్మిక శక్తి ఉందని ఈజిప్షియన్లు విశ్వసించారు. అందుకే అక్కడి ప్రజలు నల్ల పిల్లిని పూజించేవారు. అయితే ఐరోపా ప్రజలు 1560లలో యూరోపియన్ జానపద కథలలో నల్ల పిల్లులను చెడు కలిగించే జీవులుగా చిత్రీకరించారు.
  5. నారద పురాణం ప్రకారం నల్ల పిల్లి తరచుగా ఇంట్లోకి రావడం అశుభంగా భావిస్తారు. నల్ల పిల్లులు దుష్ట శక్తుల రాకకు చిహ్నంగా భావిస్తారు. పేదరికానికి సంకేతం. అందుకనే నల్ల పిల్లిని చాలా మంది ఇంట్లోకి రానివ్వరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.