AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbha 2025: మహా కుంభలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేయడం శుభప్రదం.. పూర్వీకులు సంతోష పడతారు..

మహాకుంభంలో స్నానం చేసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పుణ్యంతో పాటు పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. మహాకుంభ స్నానం చేసిన తర్వాత ఏమి దానం చేయాలో తెలుసుకుందాం.

Maha Kumbha 2025: మహా కుంభలో స్నానం చేసిన తర్వాత ఈ వస్తువులు దానం చేయడం శుభప్రదం.. పూర్వీకులు సంతోష పడతారు..
Maha Kumbhamela 2025
Surya Kala
|

Updated on: Jan 14, 2025 | 1:35 PM

Share

మహాకుంభ హిందూలో అతిపెద్ద మతపరమైన కార్యక్రమాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మహాకుంభ సందర్భంగా దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా 2025 ప్రారంభమైంది. మకర సంక్రాంతి సందర్భంగా కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. మహా కుంభంలో స్నానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయని.. దేవుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అయితే మహాకుంభ స్నానంలో చేసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.. పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్మకం.

ఆహార దానం హిందూ మతంలో అన్నదానాన్ని మహాదానం అంటారు. ఈ కారణంగా కుంభస్నానం తర్వాత తప్పని సరిగా అన్నదానం చేయాలి. ఆహారాన్ని దానం చేయడం వలన ఆధ్యాత్మిక సంతృప్తిని పొందుతారు. పూర్వీకుల ఆత్మకి కూడా విముక్తి లభిస్తుందని నమ్మకం. పూర్వీకుల ఆశీస్సులతో జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి.

వస్త్ర దానం మహాకుంభంలో స్నానం చేసిన తర్వాత అవసరమైన వారికి వస్త్రదానం కూడా చేయాలి. బట్టలు దానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ప్రయోజనం చేకూరుతుంది. పేద ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో మహా కుంభస్నానం తర్వాత ఆర్ధిక శక్తి మేరకు బట్టలు దానం చేయాలి.

ఇవి కూడా చదవండి

గంగాజల దానం మహాకుంభంలో స్నానం చేసిన తర్వాత భక్తులు తమతో పాటు గంగా లేదా త్రివేణి ఘాట్ నుంచి నీటిని సేకరించి ఇంటికి తీసుకువస్తారు. ఈ గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకోవడం శ్రేయస్కరం. అంతేకాదు ఈ నీటిని దానం చేయడం కూడా శుభం. ఈ పవిత్ర జలాన్ని ఆలయానికి ఇవ్వవచ్చు లేదా అవసరమైన వారికి ఇవ్వవచ్చు. గంగాజలాన్ని దానం చేయడం వల్ల ఆత్మకు శాంతి లభిస్తుంది.

డబ్బు విరాళం సామర్థ్యం ప్రకారం మహాకుంభంలో స్నానం చేసిన తర్వాత డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు. వీలైతే స్నానం చేసిన తర్వాత డబ్బును అనాథాశ్రమానికి లేదా వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వండి. ధనాన్ని దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

నువ్వులు, బెల్లం దానం మహాకుంభ స్నానం తర్వాత నువ్వులు, బెల్లం దానం చేయడం వల్ల శారీరక, మానసిక శుద్ధి లభిస్తుంది. మకర సంక్రాంతి రోజున మహాకుంభస్నానం చేసే వారు ఈ వస్తువులను తప్పనిసరిగా దానం చేయాలి. నువ్వులు , బెల్లం దానం చేయడం వల్ల జాతకంలో సూర్య స్థానం బలపడుతుంది. కెరీర్ రంగంలో శుభ ఫలితాలను ఇస్తుంది.

ఆవు, ధాన్యం దానం ధాన్యాన్ని, గోవులను దానం చేయడం గొప్ప దానంగా పరిగణించబడుతుంది. మహాకుంభం తర్వాత గోవును దానం చేయడం లేదా గోశాలలకు ధాన్యాన్ని దానం చేయడం చాలా శుభప్రదం. ఈ రెండు వస్తువులను దానం చేయడం వలన అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. ఆనందం, శాంతిని కూడా పొందవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.