Maha Kumbh Mela: గ్లామర్ ప్రపంచానికి దూరంగా! మహా కుంభమేళాలో ప్రముఖ నటి.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే 'మహా కుంభమేళా' సోమవారం (జనవరి 13) అట్టహాసంగా ప్రారంభమైంది. లక్షలాది మంది సాధువులు, భక్తులు త్రివేణి సంగమంలోకి దిగి స్నానాలు ఆచరించారు. తొలిరోజు సుమారు 1.5 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాకు హాజరయ్యారని సమాచారం.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకున్న ‘మహా కుంభమేళా’ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సుమారు 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభామేళా కోసం సాధువులు, భక్తులు తండోలపతండాలుగా ప్రయాగ్‌రాజ్ కు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే కుంభమేళాకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సాధ్వి వేషంలో ఉన్న ఒక ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్అవుతున్నాయి. ఆమె పేరు హర్ష రిచార్య. ఉత్తరాఖండ్ స్వస్థలం. ఈ సందర్భంగా ఒక యూట్యూబర్ ఆమె గతాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎందుకు సాధ్వి అయ్యావు?” దీనికి ఆమె ఇలా సమాధానం ఇచ్చింది.
‘నేను ఉత్తరాఖండ్ నుంచి వచ్చాను. ఆచార్య మహామండలేశ్వరుని శిష్యురాలిని. నా వయసు 30 ఏళ్లు. నేను జీవితంలో చాలా చూశాను. నటించాను. యాంకరింగ్ చేశాను. దేశ విదేశాలు తిరిగాను. కానీ జీవితంలో మనశ్శాంతి దొరకలేదు. అందుకే ఇలా ఆధ్యాత్మిక యాత్ర వైపు మళ్లాను’ అని చెప్పుకొచ్చింది హర్ష రిచార్య. అయితే తనను సాధ్విగా పిలవొద్దంటూ రిక్వెస్ట్ చేసిందామె. ‘ సోషల్ మీడియాలో నన్ను “సాధ్వి” అని ట్యాగ్ చేస్తున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. ఎందుకంటే నేను ఇంకా పూర్తి సాధ్విగా మారలేదు.’ అని చెప్పుకొచ్చింది హర్ష.
మహా కుంభమేళాలో హర్ష రిచారియా..
About For Viral Video
महाकुंभ में आई बहुत ही खूबसूरत साध्वी पत्रकार ने पूछा आप इतनी सुन्दर हैं तो साध्वी क्यों बनीं? pic.twitter.com/dEzhqNfqY6
— Shubhangi Pandit (@Babymishra_) January 12, 2025
కాగా వైరల్ కావడానికి ఇలా చేస్తున్నారన్న కామెంట్స్ పై కూడా స్పందించింది హర్ష రిచార్య. ‘నేను ఇప్పటికే దేశంలో పలు సార్లు వైరల్ అయ్యాను. ఇప్పుడు అందుకోసం ఇలా చేయాల్సిన అవసరం లేదు. నేను కోరుకున్న విధంగా జీవించాలనుకుంటున్నాను’ అని హర్ష చెప్పుకొచ్చింది.
కాగా హర్ష యాంకర్ గా వ్యవహరిస్తోంది. నటనలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. భక్తి పాటల ఆల్బమ్‌లలో ఆమె నటించింది. ఇక సోషల్ మీడియాలోనూ హర్ష రిచార్య బాగా పాపులర్. ఆమెకు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో భారీగా ఫాలోవర్లు ఉన్నారు.
సోషల్ మీడియాలో బాగా ఫేమస్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.