AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి మూవీరా బాబు.. ఓటీటీలో అదరగొడుతున్న సినిమా.. క్లామాక్స్ మాత్రం కేక అంతే..

కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే.. అల్రెడీ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీల్లో ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల్లో సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా రకాల జోనర్స్‌లో సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.

ఇదెక్కడి మూవీరా బాబు.. ఓటీటీలో అదరగొడుతున్న సినిమా.. క్లామాక్స్ మాత్రం కేక అంతే..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Jan 14, 2025 | 6:07 PM

Share

ఓటీటీలో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నపటికీ ఓటీటీలో సినిమాలకు మాత్రం ఎక్కడా డిమాండ్ తగ్గడం లేదు. వారాంతం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాదు.. ఇతర బాషల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైమెంట్ ఇస్తున్నాయి. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తుంది. బడా హీరోలంతా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన కూడా భారీగా వసూల్ చేసి అందరూ ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి. తాజాగా ఓ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ వసూళ్లను రాబట్టి.

ఇది కూడా చదవండి : ఏంటీ..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయినా.! అదికూడా తెలుగమ్మాయి

చిన్న సినిమాగా వచ్చి ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుందీ సినిమా.. థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ సినిమా పేరు సూక్ష్మదర్శిని. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రలో నటించింది. నజ్రియా నజీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ చిన్నది ఒకే ఒక్క సినిమా చేసింది. కానీ ఇక్కడి ప్రేక్షకులకు అంతకంటే ముందే పరిచయం అయ్యింది.

ఇది కూడా చదవండి :Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?

తమిళ్ లో ఈ చిన్నది నటించిన రాజా రాణి సినిమా మనదగ్గర భారీ విజయాన్ని అందుకుంది. బాసిల్, నజ్రియా నజీమ్ జంటగా నటించిన సూక్ష్మదర్శిని డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊహించిన దానికంటే ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, దాదాపు రూ.60 కోట్ల కలెక్షన్లు సాధించింది. మిస్టరీ, థ్రిల్లర్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమా క్లామాక్స్ అస్సలు ఊహించలేరు. థియేటర్స్ లో తెలుగులోనూ రిలీజ్ అయ్యింది ఈ సినిమా.. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెడుతుంది. ఈ మూవీ  డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. జనవరి 11 ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us