ఏంటీ..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయినా.! అదికూడా తెలుగమ్మాయి
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. రాజమౌళి సినిమా పాన్ వరల్డ్ మూవీగా ఉండనుంది. మహేష్ బాబు చివరగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ మూవీ పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ఎలా ఉంటుంది.? మహేష్ ఎలా కనిపిస్తాడు.? రాజమౌళి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అని ప్రేక్షకులంతా వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా ఉండనుంది. మహేష్ బాబు చివరగా నటించిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే మహేష్ సినిమా రావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది.
దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ రెండు మూడేళ్లు మహేష్ బాబు సినిమా లేకుండా ఎలా అంటూ ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన రీ రిలీజ్ సినిమాలు కొన్ని ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. త్వరలోనే అతిథి సినిమా రిలీజ్ కానుంది. అలాగే కొంతమంది ఫ్యాన్స్ ఆయన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఓల్డ్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పై ఫొటోలో మహేష్ బాబు చేతిలో ఉన్న పాప ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్, పైగా మన తెలుగమ్మాయి ఆమె. ఆమె మరెవరో కాదు క్రేజీ హీరోయిన్ శ్రీ దివ్య. మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాలో శ్రీ దివ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. యువరాజు సినిమాలో ఈచిన్నది కనిపించేది కొన్ని సీన్స్ లోనే అయినా తన క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది. శ్రీదివ్య బస్ స్టాప్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ఈ చిన్నది. ఇప్పుడు తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది శ్రీదివ్య.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.