konaseema: యానాం బీచ్‌లో సంక్రాంతి సందడి.. బీచ్‌ బైక్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు

తెలుగువారి లోగిల్లలలో సంక్రాంతి సందడి నెలకొంది. పట్టణాలు చిన్నబోతున్నాయి.. పల్లెలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కళకళాడుతున్నాయి. ఆంధ్రా గోవా బీచ్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండగ పూర్తయ్యే వరకు జరిగే ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. పర్యాటకుల కోసం బీచ్‌ రైడ్ బైకులను సిద్ధం చేశారు.

konaseema: యానాం బీచ్‌లో సంక్రాంతి సందడి.. బీచ్‌ బైక్‌లను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందరావు
Sankranti In Yanam
Follow us
Surya Kala

|

Updated on: Jan 14, 2025 | 1:19 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం బీచ్‌లో సంక్రాంతి సందడి నెలకొంది. ఆంధ్ర గోవా బీచ్‌గా పిలుచుకునే ఎస్ యానాం బీచ్‌లో సంక్రాంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. పర్యాటకుల కోసం బీచ్‌ బైక్‌ రైడ్‌లను ఏర్పాటు చేశారు. ఈ బీచ్‌ బైక్‌లను ప్రారంభించారు ఆనందరావు. వాటిని నడిపి బీచ్‌లో సరదాగా గడిపారు.

గోవా తరహాలో ఉండే వైట్ శాండ్ బీచ్‌ కావడంతో పర్యాటకంగా ప్రమోట్ చేసేందుకు కొత్త హంగులు అద్దుతున్నారు. ఎస్ యానాం బీచ్‌ను ఆంధ్రా గోవా బీచ్‌గా ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త సదుపాయాలు కల్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సంక్రాంతి సందర్భంగా బీచ్‌లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాయంత్రం సినీ మ్యూజికల్ ఆర్కెస్ట్రా పెట్టారు. సినీ నటులతో వినోద కార్యక్రమాలు ఏర్పాటుచేశామన్నారు ఎమ్మెల్యే ఆనందరావు. ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎస్‌ యానాంకు పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారాయన.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..