Viral News: అందమైన ద్వీపానికి మేనేజర్ కావాలట.. ఏడాదికి 26 లక్షల జీతం.. ఎక్కడంటే

ప్రస్తుత పరిస్థితి చిన్నది పెద్దది అనే తేడాలేకుండా ఉద్యోగం వస్తే చాలు అన్నట్లు ఉంది. చాలా మంది చదువుతో సంబంధం లేకుండా శ్రమకు తగిన వేతనం ఇచ్చే పని ఉంటే చాలు అని కూడా భావిస్తున్నారు. అటువంటి వారికీ గుడ్ న్యూస్ చెబుతోంది ఒక సంస్థ. ఒక ద్వీపంలో మేనేజర్ ఉద్యోగం ఉంది. ఈ ఉద్యోగానికి లక్షల జీవితం కూడా ఇస్తారు. ప్రస్తుతం వార్తల్లో నిలిచిన ఉద్యోగం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Viral News: అందమైన ద్వీపానికి మేనేజర్ కావాలట.. ఏడాదికి 26 లక్షల జీతం.. ఎక్కడంటే
Managare Job
Follow us
Surya Kala

|

Updated on: Jan 14, 2025 | 12:41 PM

ప్రతి వ్యక్తి మంచి ఉద్యోగం సంపాదించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. మంచి ఉద్యోగం ఉంటే తన కలలను నెరవేర్చుకోవచ్చు అని భావిస్తాడు. అయితే.. కొన్ని ఉద్యోగాలు వార్తల్లో నిలుస్తు ఆకట్టుకుంటాయి. ఆ ఉద్యోగాల గురించి ఎవరూ ఊహించ లేరు కూడా.. అలాంటి పని ఒకటి ఈ రోజుల్లో ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఒక ద్వీపంలో మేనేజర్ అవసరం. దీని కోసం మీకు ప్రతి సంవత్సరం 26 లక్షలు ఇవ్వబడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ద్వీపం పూర్తిగా నిర్జీవంగా ఉంటుంది.

స్కాట్‌లాండ్‌లోని ఒక ద్వీపంలో మేనేజర్ అవసరం. ఈ ద్వీపం చాలా అందంగా ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ జనాభా ఉండరు. కాలనీ లేదు, పరిశ్రమలు లేవు… ఇంకా ఇక్కడ ప్రభుత్వం ఈ ద్వీపానికి మేనేజర్‌గా చేస్తున్న వ్యక్తిని తొలగించింది. ఈ ద్వీపం పేరు హండా. ఇది స్కాట్లాండ్ పశ్చిమ తీరంలో ఉంది. ఇక్కడ సముద్రతీరంలో ఎత్తైన రాళ్ళు, అద్భుతమైన సహజ దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది పడవ ద్వారా మాత్రమే.

ఈ ద్వీపం ఎక్కడ ఉందంటే ఈ ఉద్యోగాన్ని స్కాటిష్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ప్రకటించింది. ఇక్కడ నియమించబడిన వ్యక్తి పని ఒక రేంజర్ లా ఉంటుంది. అంతేకాదు అక్కడకు వచ్చే 8,000 మంది పర్యాటకులను, పక్షులు, ఇతర వన్యప్రాణుల భద్రతను నిర్వహిస్తూ ఉండాలి. స్వచ్ఛంద సేవకుల బృందం కూడా మేనేజర్ నేతృత్వంలో ఉంటుంది. ఎవరైనా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ఈ ద్వీపం యూరప్‌లోని అత్యంత ముఖ్యమైన సముద్ర పక్షుల పెంపకం ప్రదేశాలలో ఒకటి అని మీకు తెలియజేద్దాం.

ఇవి కూడా చదవండి

అయితే సముద్ర, భూసంబంధ సహజ చరిత్రపై అవగాహన ఉంటే ఈ ఉద్యోగానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ ఉద్యోగం మార్చి నుంచి ప్రారంభమయ్యి ఆరు నెలల నిర్ణీత వ్యవధిలో ఉంటుంది. ఎవరైనా ఇక్కడకు వెళ్ళాలని కోరుకుంటే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు, బట్టలు ఉతకడం, షాపింగ్ , బ్యాంకింగ్ వంటి అవసరమైన అవసరాల కోసం ద్వీపం నుంచి గ్రామానికి వెళ్లడానికి అనుమతి ఇస్తారు. ఈ ఉద్యోగం నగరంలోని సందడి నుంచి దూరంగా ఉండాలనుకునే వారికి ఉత్తమమైన జాబ్ ఇది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..