- Telugu News Photo Gallery Cinema photos These are the blockbuster movies that Vijay Devarakonda missed!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ మంచి ఫ్యాన్ ఫాలొయింగ్ సంపాదించుకున్నాడు. ఈ హీరోకి యూత్ ఫాలొయింగ్ కూడా ఎక్కువే. అయితే విజయదేవరకొండ మూవీలు హిట్టా ఫట్టా అని లెక్క చేయకుండా ప్రేక్షకులు ఎగబడతారు.
Updated on: Jan 15, 2025 | 4:22 PM

విజయదేవరకొండ తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎక్కువ ఇంపార్టెన్స్ లేని సపోర్టీంగ్ పాత్రలో చేశాడు. తనకు పెళ్లి చూపులు మూవీతో మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.విజయ దేవరకొండ, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ డ్రామా పెళ్లి చూపులు నేషనల్ అవార్డు కైవసం చేసుకుంది. ఇక ఈ మూవీ అనంతరం విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఒక సంచలనం సృష్టించింది.

బోల్డ్ అండ్ ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల సునామితో దూసుకెళ్లింది. అయితే విజయ దేవరకొండ తన సినీ కెరీర్ లో నాలుగు బ్లాక్ బస్టర్ మూవీలను వదులుకున్నాడంట. ఇంతకీ అవి ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ కి ఆర్‌ఎక్స్ 100 మూవీ ఆఫర్ వచ్చిందంట కానీ అప్పటికే అర్జున్ రెడ్డి మూవీ చేసి ఉన్న విజయ్ దేవరకొండ దానిని రిజెక్ట్ చేశాడట. అంతే కాకుండా, ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కూడా ముందుగా పూరి జగ్నాధ్, విజయ్ దేవరకొండ అనుకున్నాడంట. కానీ విజయ్ దేవరకొండకు హీరో క్యారెక్టర్ నచ్చకపోవడంతో దానిని వదులుకున్నాడు. కానీ ఈమూవీ సూపర్ హిట్ అందుకుంది.

అలాగే ఉప్పెన సినిమా ఎంత మంచి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీతో కృతిశెట్టికి, వైష్ణవ్ తేజకు మంచి ఫేమ్ వచ్చింది . బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకక్కిన ఈ సినిమా మొదటి రోజునుంచే మంచి కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో మొదట విజయ్ దేవర కొండను అనుకోగా, విజయ్ రిజెక్ట్ చేయడంతో మెగా హీరోకు ఛాన్స్ దక్కింది.

అదేవిధంగా విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న హిట్ చిత్రాల్లో భీష్మ ఒకటి. నితిన్ కెరీర్లో భీష్మ వన్ ఆఫ్ ది హిట్ మూవీస్. ఈ సినిమాలో హీరోగా మొదట విజయ్ దేవరకొండను అనుకున్నారట. కానీ విజయ్ దేవరకొండకు కథ నచ్చకపోవడంతో రిజక్ట్ చేశాడంట.