Andhra Pradesh: సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త.. సోషల్ మీడియా లోగోలతో వెరైటీ ముగ్గు

ఇంటి ముందు ముగ్గు అంటే అందరికీ ఇష్టమే. సంక్రాంతి పండగ నెల రోజుల ముందు నుంచే ఇంటి ముందు రకరకాల ముగ్గులు కొలువుదీరతాయి. ముగ్గులు సంప్రదాయానికి ప్రతీక. చాలామందికి ఇంతవరకే తెలుసు. అయితే ముగ్గు ద్వారా సొసైటీకి మంచి సందేశం ఇవ్వవచ్చు అని ఓ మహిళ నిరూపించింది. సమాజానికి సందేశాత్మక ముగ్గు వేసి ఔరా అనిపించింది...

Andhra Pradesh: సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్త.. సోషల్ మీడియా లోగోలతో వెరైటీ ముగ్గు
Social Media Rangoli
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Jan 14, 2025 | 12:59 PM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబంరాలు అంబరాన్ని తాకుతున్నాయి. కొత్త అల్లుళ్ళు, ఇంటి ముందు ముగ్గులు, భోగి మంటలు, కొత్త సినిమాల సందడి నెలకొంది. అయితే నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలోని సాయిబాబా పేటలో అనూష అనే మహిళ ముగ్గు అందరినీ ఆకట్టుకుంటుంది. పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్ జరుగుతున్న సందర్భంలో… సోషల్ మీడియా లోగోలతో ముగ్గు వేసి సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సందేశాన్ని అందులో చూపించింది. వాట్సాప్, మెయిల్, ఫేస్బుక్, తదితర సోషల్ మీడియా లోగోలను తన ముగ్గులో పొందుపరిచింది అనూష. వీటి ద్వారానే కొందరు సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారని, మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వాటి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలనేది ఈ ముగ్గు  సారాంశం అని అంటోంది అనూష. మొత్తం మీద తన ముగ్గు ద్వారా సమాజానికి సందేశాత్మకతను కూడా అందించవచ్చని నిరూపించారు అనూష.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..