Los Angeles: లాస్ ఏంజిల్స్‌లో కొనసాగుతున్న మంటలు విధ్వంసం.. పెను ప్రమాదంలో 1 కోటి మంది ప్రజలు
కాలిఫోర్నియా అడవుల్లో ప్రారంభమైన మంటలు లాస్ ఏంజిల్స్ కౌంటీలో ప్రమాదకర రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ మంటల ప్రభావంతో 10 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంటకు 70 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో మంటలు వ్యాపించే ప్రమాదం మరింత పెరిగింది. స్థానిక యంత్రాంగం, అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉంది. అయితే పరిస్థితి విషమంగా ఉంది.
కాలిఫోర్నియా అడవుల్లో ప్రారంభమైన మంటలు లాస్ ఏంజెల్స్ కౌంటీలోభయంకరంగా విజృంభిస్తున్నాయి. ఈ ప్రాంతలోని 10 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇక్కడగంటకు 70 మైళ్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా అగ్ని ప్రమాదం.. మంటల ఉదృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని.. స్థానిక యంత్రాంగం హెచ్చరిస్తుంది. అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రోజు రోజుకీ పరిస్థితి అదుపు తప్పుతోంది.
ఈ మంటల కారణంగా మొత్తం లాస్ ఏంజెల్స్ కౌంటీ జనాభా ప్రమాదంలో ఉంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు భారీ ఎత్తున తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు వేగంగా వ్యాపించడం వల్ల మరింత విధ్వంసం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పౌరులు అప్రమత్తంగా ఉండాలని.. అధిరుల సూచనలను పాటించాలని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు.
వేల ఎకరాల భూమి నాశనం
కాలిఫోర్నియా అడవుల్లో మంటలు భారీ రూపం దాల్చాయి. మీడియా నివేదిక ప్రకారం ఇప్పటివరకు 16,300 హెక్టార్ల (40,300 ఎకరాలు) భూమి కాలిపోయిందని.. 12,300 కంటే ఎక్కువ భవనాలు ధ్వంసమయ్యాయని చెబుతున్నారు. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫారెస్ట్రీ అండ్ ఫైర్ ప్రొటెక్షన్ ప్రకారం మూడు వేర్వేరు ప్రదేశాలలో మంటలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి. ఈ కారణంగా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.
స్థానిక యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మంటలను అదుపు చేయడానికి సవాలుగా నిలుస్తోంది వాతావరణం.. బలమైన గాలులు. ఇవి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు పౌరులను ఆదేశించారు.
సమస్యగా మారుతున్న బలమైన గాలులు
బలమైన గాలులు, పొడి వాతావరణ పరిస్థితులు కాలిఫోర్నియా అడవి మంటలను ఆర్పడానికి.. సహాయక చర్యలకు తీవ్రమైన సవాళ్లను విసురుతున్నాయి. శాంటా అనాలోని బలమైన గాలులు మంటలను మరింత పెంచుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరం అవుతుంది. జో టెన్ ఐక్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫైర్ ఫైటర్స్‌తో అడవి మంటల నిపుణుడు.. ది వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ హెలికాప్టర్లు అధిక గాలుల సమయంలో భూమికి దగ్గరగా ఎగరడం సురక్షితం కాదని చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..