AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: చనిపోయిన 3 నిమిషాల్లో నరకాన్ని చుట్టి వచ్చాడట.. ఆ తర్వాత ఇది సీన్

చనిపోయిన వ్యక్తి నరకాన్ని చూసి వచ్చాడట.. ఏంటి.! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. అవునండీ.! ఇది నిజంగానే జరిగింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నరకానికి వెళ్లి వచ్చాడట. మరి ఇంతకీ అదేంటో.. ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.

Viral: చనిపోయిన 3 నిమిషాల్లో నరకాన్ని చుట్టి వచ్చాడట.. ఆ తర్వాత ఇది సీన్
Viral
Ravi Kiran
|

Updated on: Jan 14, 2025 | 5:07 PM

Share

మరణం అనేది జీవితంలోని చేదు నిజం. దీనిని ఎవరూ కాదనలేరు. అంటే ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన ఎవ్వరైనా మళ్లీ తిరిగి రాలేరు. అయితే ఇటీవల ఓ వ్యక్తి చేసిన వింత ప్రకటన.. ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఆ వ్యక్తిని వైద్యులు చనిపోయినట్లుగా ప్రకటించారు. కానీ మూడు నిమిషాల్లో తిరిగి శ్వాస తీసుకున్నాడు. ఈ 3 నిమిషాల్లో అతడికి ఏం జరిగిందంటే.?

అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. తీరా అక్కడి వైద్యులు అతడికి పరీక్షలు జరిపి.. చనిపోయినట్టు ధృవీకరించారు. అయితే అనుకోని విధంగా మూడు నిమిషాల్లో అతడి శరీరం తిరిగి కదిలింది. చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి వచ్చాక ఏం చెప్పాడో చూస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. నరకానికి వెళ్లి వచ్చిన అతడు.. అక్కడ చల్లగా.. తక్కువ వేడి ఉందని చెప్పాడట. నరకంలో తాను ఏదో చూశానని.. అది తను తిరిగి బ్రతకడానికి హెచ్చరిక లాంటిదని తెలిపాడట.

దురదృష్టవశాత్తూ అతడు కొద్ది నిమిషాల్లోనే మరణించాడని తోటి స్నేహితుడు రెడ్డిట్‌లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. 2019లో, కెన్సాస్‌కు చెందిన షార్లెట్ హోమ్స్ కూడా ఇదే విధమైన కామెంట్స్ చేసింది. 11 నిమిషాలకే స్వర్గానికి చేరుకున్నానని చెప్పింది. ఆ సమయంలో ఆమెకు బీపీ ఎక్కువైందని ఆస్పత్రిలో చేర్చారు.

ఇవి కూడా చదవండి

People who legally died for a few minutes and came back, what was it like? byu/Doomage007 inAskReddit

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి