AP News: దండిగా చేపలు పడతాయని వల విసిరారు.. తీరా పైకి లాగి చూడగా

చేపల కోసం వలకు వెళ్లారు కొందరు మత్య్సకారులు.. సముద్రంలో వల వేసి.. కొంచెం సేపు వేచి చూశారు.. ఈలోగా వల బరువెక్కింది. పెద్ద చేపలు చిక్కాయని తెగ సంబరపడిపోయారు.. పైకి లాగి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ వారికి ఏం చిక్కాయో ఇప్పుడు తెలుసుకుందామా..

AP News: దండిగా చేపలు పడతాయని వల విసిరారు.. తీరా పైకి లాగి చూడగా
Fishing
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ravi Kiran

Updated on: Jan 13, 2025 | 1:46 PM

పండగ పూట చేపల వేట.. ఎప్పుడూ ఉన్న జీవితమే కదా.. రెండు చేపలు పడితే వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో ఓ పూట తింటాం.. అని అనుకున్నారు ఆ మత్స్యకారులు. కాస్త చేపలు ఎక్కువ వలకు చికితే పండుగ పూట కుటుంబానికి సందడి.. లేకుంటే అంతే.. అని అనుకున్నారు. వేటకు వెళ్లారు. దేవుడుపై భారం వేసి వల విసిరారు. చేపల కోసం శ్రమించారు. అంతే.! వాళ్లకు పంట పండింది. ఏవో కిలోల కొద్ది చేపలు వలకు చిక్కలేదు. కేవలం రెండు చేపలతో ఆ మత్స్యకారులు ఎగిరి గంతేశారు. అవే కచిడి చేపలు.

అనకాపల్లి జిల్లా పూడిమడకలో వేటకు వెళ్లారు మత్స్యకారులు. అచ్యుతాపురం మండలం సముద్రంలో వేట చేస్తూ ఉన్నారు. ఇంతలో వాళ్ల వలకు రెండు కచేరి చేపలు పడ్డాయి. వాటిని చూడగానే మత్స్యకారూలు ఎగిరి గంతేశారు. ఒడ్డుకు ఆ చేపలను తీసుకొచ్చారు. అమ్మకానికి పెట్టారు. విషయం తెలుసుకున్న కొంతమంది వ్యాపారులు ఆ చేపలను కొనేందుకు పోటీపడ్డారు. చివరకు పూడిమడక ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఈ రెండు చేపలను లక్షా నలభై వేలకు కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు మత్స్యకారులు.

రుచి.. ఔషధ గుణాలు.!

కచిడి చేపలు బంగారు వర్ణంలో ఉంటాయి. చూసేందుకు ఆకట్టుకుంటాయి. అందుకే వీటిని గోల్డెన్ ఫిష్ అని కూడా అంటారు. మగ చేపలు అయితే నిగనిగా లాడుతూ కనిపిస్తాయి. రుచి మామూలుగా ఉండదు మరి.. ఔషధ గుణాలు కూడా ఎక్కువే అంటున్నారు మత్స్యకారులు. కొన్ని రకాల మందుల్లో కూడా వీటి అవశేషాలు వాడతారని చెబుతున్నారు. అంతేకాదు సర్జరీ చేసిన తర్వాత వేసే కుట్ల కోసం ఈ చేప నుంచి వచ్చే పదార్థంతో తయారు చేస్తారట. ఈ చేప రెక్కలను మరికొన్ని పదార్థాలు ప్రాసెసింగ్ చేసేందుకు వినియోగిస్తారని కూడా మరి కొంతమంది చెబుతున్నారు.

ఇది చదవండి: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

Fishes

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి