AP News: గ్రామ శివారు బావిలో వింత శబ్దాలు.. డౌట్ వచ్చి.. వెళ్లి చూడగా

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకేరోజు నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు కన్న తల్లుల చేతిలోనే పోయాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న బిడ్డల్ని ఆ తల్లులే కడ తీర్చేందుకు కారణమయ్యారు. ఆ వివరాలు ఇలా

AP News: గ్రామ శివారు బావిలో వింత శబ్దాలు.. డౌట్ వచ్చి.. వెళ్లి చూడగా
Representative Image
Follow us
Raju M P R

| Edited By: Ravi Kiran

Updated on: Jan 13, 2025 | 2:01 PM

నగరి, సదుంలో జరిగిన రెండు ఘటనలు నలుగురు చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసి పోయేలా చేసాయి. నగరి మున్సిపాలిటీ సాల్వపట్టెడలో చోటు చేసుకున్న విషాదం ఇద్దరు పిల్లల ప్రాణాలు బలి తీసుకుంది. ఇద్దరు పిల్లలతో పాటు బావిలో దూకిన తల్లి ప్రాణాలతో బయటపడింది. నగరి మున్సిపాలిటీలోని భీమానగర్‌కు 33 ఏళ్ల దేవికి చెన్నై వెస్ట్ మాంబళంకు చెందిన ధనుంజయులుతో పెళ్లి జరగ్గా వీళ్లకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంక్రాంతి పండుగకు ఇద్దరు పిల్లలుతో కలిసి నగరి సొంతూరులో వచ్చిన దేవీ ఈ దారుణానికి పాల్పడింది. 10 ఏళ్ల ఐశ్వర్య, 3 ఏళ్ల అక్షరతో కలిసి నగరికి వచ్చిన దేవీ సాల్వపట్టేడలో ఉంటున్న పెద్దనాన్న ఇంటికి వెళ్లి వస్తానని బిడ్డల్ని తీసుకెళ్ళింది. తిరిగి దేవీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు. గ్రామం మొత్తం తిరిగినా ప్రయోజనం లేకపోగా సాల్వపట్టేడ గ్రామ శివారులో బావిలో పడ్డవారిని స్థానిక యువకులు గుర్తించారు. ప్రాణాలతో ఉన్న తల్లి దేవిని కాపాడిన యువకులు అప్పటికే మృతి చెందిన చిన్నారులను కాపాడలేకపోయారు. డెడ్ బాడీలను ఫైర్ సిబ్బంది బయటకు తీయగా తల్లి దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇక సదుంలోనూ మరో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు ఉరి వేసి ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లి షేక్ కరిష్మా నిర్వాకం వెలుగు చూసింది. ఈ ఘటనలోనూ ఇద్దరు ఆడపిల్లలు మృతి చెందగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది. అత్త, కోడళ్ల మధ్య వివాదమే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదుం మసీదు వీధిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మన్సూర్ భార్య షేక్ కరిస్మాకు అత్త గవహర్ జాన్ మధ్య వివాదంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అత్త కోడల మధ్య గొడవ ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలి తీసుకునేందుకు కారణమైంది. షేక్ కరిష్మా కూతుళ్లు షిర్దా, జర ఫాతిమాలను మిద్దెపైకి తీసుకెళ్లి కరెంట్ వైర్‌తో ఉరివేసి.. ఆమె కూడా ఉరి వేసుకుంది. అయితే ఇది గమనించిన కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేశారు. గది తలుపులు పగలగొట్టి కొన ఊపిరితో ఉన్న కరిష్మాను ఆసుపత్రికి తరలించారు. విగత జీవులుగా పడి ఉన్న ఇద్దరు చిన్నారులు కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే పిల్లలు అప్పటికే వైద్యులు తల్లికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇలా జిల్లాలో రెండు ఘటనలు నలుగురు పిల్లల ప్రాణాలను బలి తీసుకోగా ఇద్దరు తల్లులను ఆసుపత్రి పాలు చేసినట్లు అయ్యింది.

ఇది చదవండి: సంక్రాంతి జాతర.. ఏపీ వైపు ఎన్ని వాహనాలు వెళ్లాయో తెలిస్తే బిత్తరపోతారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి