APCOB Bank Jobs: ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్, క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎంపికైతే నెలకు రూ.60 వేల జీతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్... ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) భారీగా ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీగా ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. డిగ్రీ లేదా పీజీ డిగ్రీలో ఏదైనా కోర్సులో ఉత్తీర్ణులైన వారు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 251 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుంటూరు, కృష్ణా, విజయవాడ, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోని డిస్ట్రిక్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్స్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జనవరి 22, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇలా..
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల సంఖ్య: 50
- స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల సంఖ్య: 201
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణ పొంది ఉండాలి. లేదా 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీనితో పాటు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో చదవటం, రాయడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి అక్టోబర్ 31, 2024వ తేదీ నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో గడువు సమయం ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, పీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.500 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.26,080 నుంచి రూ.57,860 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ అధికారిక వెబ్‌సైట్ లింక్‌లోని జిల్లా వారీగా ఇచ్చిన నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.