Sankranti: సంక్రాంతి జాతర.. ఏపీ వైపు ఎన్ని వాహనాలు వెళ్లాయో తెలిస్తే బిత్తరపోతారు
ముచ్చటైన మూడు రోజుల సంక్రాంతి పండుగకు జనాలు పల్లెలకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి పతంగి టోల్ ప్లాజా ద్వారా గత రెండు రోజుల్లో ఎన్ని వాహనాలు క్రాస్ అయ్యాయో తెల్సా.? నెంబర్ తెలిస్తే మీరు కచ్చితంగా బిత్తరపోతారు. లేట్ ఎందుకు ఈ స్టోరీ చూసేయండి.
ముచ్చటైన మూడు రోజుల సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి లక్షలాదిమంది తరలివెళ్లారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాలకు రికార్డు స్థాయిలో ప్రయాణికులు తరలిపోయారు. దీంతో తెలుగు రాష్ట్రాల వారధి హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై మూడు రోజులపాటు సంక్రాంతి వాహనాల రద్దీ కొనసాగింది. గత ఏడాది రికార్డును బ్రేక్ చేస్తూ ఈసారి పంతంగి టోల్ ప్లాజా మీదుగా వాహనాలు వెళ్లాయి. ఈ టోల్ ప్లాజా మీదుగా ఎన్ని వాహనాలు వెళ్ళాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
సంక్రాంతి కోసం నగరవాసులు పల్లెబాట పట్టారు. కుటుంబ సభ్యులతో లక్షలాదిమంది ఊరి బాట పట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల వారిది హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి మూడు రోజులపాటు వాహనాలతో కిక్కిరిసిపోయింది. రికార్డు స్థాయిలో నగర వాసులు ఏపీ, తెలంగాణ పల్లెలకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు ఈ హైవేపై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కీసర వద్ద మూడు టోల్ ప్లాజాలు ఉన్నాయి. గత ఏడాది బోగికి ముందు రెండు రోజుల్లో 1.45లక్షల వాహనాలు పంతంగి టోల్‌గేటు మీదుగా వెళ్లినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఒక రోజైతే 77 వేల వాహనాలు పంతంగి టోల్ ప్లాజా మీదుగా రికార్డు స్థాయిలో వెళ్లాయి.
ఈ ఏడాది కూడా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సందడి చేశాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూత్‌లు ఉండగా, 12 బూతుల ద్వారా వాహనాలను విజయవాడ వైపు పంపించారు. కేవలం నాలుగు టోల్ బూతుల ద్వారా మాత్రమే హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను పంపించారు. ఈసారి మూడు రోజులపాటు పంతంగి టోల్ ప్లాజా వద్ద విరామం లేకుండా విజయవాడ వైపు వాహనాల రద్దీ కొనసాగింది. అయితే గత ఏడాదితో పోల్చితే ఈసారి అంతకంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో పంతంగి టోల్ ప్లాజా మీదుగా వాహనాలు ఏపీ వైపు వెళ్లాయి. శుక్రవారం 60 వేల వాహనాలు, శనివారం 83వేల వాహనాలు, ఆదివారం 65వేల వాహనాలు వెళ్లాయి. మొత్తం మూడు రోజులు కలిపి రికార్డు స్థాయిలో రెండు లక్షలకు పైగా వాహనాలు పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లినట్లు టోల్ ప్లాజా నిర్వాహకులు చెబుతున్నారు.
ఇది చదవండి: కమ్మటి సమోసాలో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్.!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి