AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం

Tirumala Temple News: తిరుమలలోని లడ్డూ కౌంటర్‌లో సోమవారంనాడు అగ్ని ప్రమాదం సంభవించింది. భయంతో భక్తులు ఆందోళన చెందారు. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. పెద్దగా నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Tirumala: తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం
Tirumala Temple
Janardhan Veluru
|

Updated on: Jan 13, 2025 | 1:03 PM

Share

తిరుమల, 13 జనవరి 2025: తిరుమలలో అపశృతి చోటు చేసుకుంది. తిరుమలలోని లడ్డూ పంపిణీ కౌంటర్‌లో సోమవారంనాడు స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 47 వ కౌంటర్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే సిబ్బంది స్పందించి మంటలు.. ఇతర కౌంటర్లకు పాకకుండా ఆర్పివేశారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా లడ్డూ పంపిణీ కౌంటర్‌లో స్వల్ప అగ్ని ప్రమాద ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పెద్దగా నష్టమేమీ జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.  లడ్డూ ప్రసాదం పంపిణీ చేసే సమయంలో అగ్నిప్రమాదం జరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.