Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: కూతురిపైనే కన్నేసిన తండ్రి.. కంటి పాపనే కాటేయబోయిన భర్తను హత్య చేసిన భార్యలు..

మనిషి అన్నవాడు.. మాయ అవుతున్నాడమ్మా.. అన్నాడో మహా కవి. మానవత్వం లేకుండా వావివరసలు మరిచి కంటి పాపనే కాటేయబోయాడు కామాంధుడు. దీనిని సహించలేని భార్యలు ఇద్దరూ కలిసి రోకలిబండతో కామాంధుడిని హత్య చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Crime News: కూతురిపైనే కన్నేసిన తండ్రి.. కంటి పాపనే కాటేయబోయిన భర్తను హత్య చేసిన భార్యలు..
Telangana Crime News
Follow us
M Revan Reddy

| Edited By: Surya Kala

Updated on: Jan 14, 2025 | 2:31 PM

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండాకు చెందిన రత్నావత్‌ సైదులు (40) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను 2003లో నకిరేకల్‌ మండలం కోడూరుకు చెందిన రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి వారికి ఇద్దరు కుమార్తెలు. మగ పిల్లవాడి కోసం రమ్య సోదరి సుమలతను 15ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు పదేళ్ల కుమారుడు ఉన్నాడు. అప్పటి నుంచి ఇద్దరు భార్యలు, సైదులు నాయక్ ఒకే ఇంట్లో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ చదువుతున్న సైదులు, రమ్య దంపతుల చిన్న కుమార్తె ఆరునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. పెద్ద కుమార్తె హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతోంది. సంక్రాంతి పండుగకు పెద్ద కుమార్తె తండాకు వచ్చింది. ఆమెను తండ్రి సైదులు సూర్యాపేటకు షాపింగ్‌కు తీసుకెళ్లి బట్టలు కూడా కొనిచ్చాడు. ఇంటికి వచ్చిన కూతురును సైదులు లైంగికంగా వేధించారని భార్యలు చెబుతున్నారు.

రాత్రి మద్యం తాగి వచ్చిన సైదులు.. ఇంట్లో మంచం మీద నిద్రిస్తున్న కుమార్తె పట్ల మరోసారి అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తల్లిని నిద్ర లేపి జరిగిన విషయం చెప్పింది. కన్న కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన కీచకుడిని ఇద్దరు భార్యలు సహించ లేకపోయారు. సైదులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రమ్య, సుమలత కలిసి ముందస్తు ప్రణాళికతో రోకలిబండతో తల, మెడపై మోది హత్య చేశారు. హత్య చేసిన సమయంలో ఇంట్లో పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. అనంతరం ఇద్దరు భార్యలు అక్కడినుంచి పారిపోయారు.

స్థానికులు తెల్లవారుజామున ఇంటి ముందు విగత జీవిగా పడి ఉన్న సైదులు నాయక్ ను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని చివ్వెంల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్యల వివాహేతర సంబంధాలకు అడొస్తున్నాడనే వారి ప్రియులతో కలిసి సైదులు నాయక్ ను హత్య చేశారని సైదుల బంధువులు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..