ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే అంతే సంగతులు..
TV9 Telugu
14 January 2025
ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పండ్లు తీసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
పుచ్చకాయ తినగానే నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్ తినగానే నీల్లు తాగితే బాడీ హైడ్రేట్ అయ్యి, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
యాపిల్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే యాపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
అరటిలోని ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే అరటి పండు తినగానే నీరు తాగితే రక్తంలోని షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దానిమ్మ తినగానే నీటిని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కడుపులో వికారం, అసిడిటీ, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
సిట్రస్ జాతికి చెందిన పండ్లు తీసుకోగానే కూడా నీటిని తాగకూడదు. ఇలా చేస్తే.. శరీరంలోని pH లెవల్స్ గణనీయంగా తగ్గిపోతాయి. జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి.
నేరేడు పండ్లు తినగానే నీళ్లు తాగితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డయేరియా, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమికి సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.