ప్రేయసికి ప్రపోజ్‌ చెయ్యాలనుకొంటున్నారా.? అయితే ఇది మీ కోసమే

TV9 Telugu

13 January 2025

ప్రపోజ్‌ చేసేందుకు రెడీ అయ్యారా? ప్రేమలేఖలు ఎలా రాయాలి? కవితల కోసం ఎక్కడ సర్చ్ చేయాలని ఆందోళన పడుతున్నారా?

కాలం మారినా కవితలతో ప్రేమను వ్యక్తపరిచే వ్యక్తులు ఇంకా ఉన్నారు. అయితే కవితల కోసం కవితాత్మక ఆలోచనలు అందరికి రావు, రావాల్సిన అవసరమూ లేదు.

అలాంటి వారికి ChatGPT చాలా ఉపయోగపడుతుంది. ముందుగా మీ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్‌లో చాట్‌జీపీటీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

లెటర్ మాత్రమే కాకుండా మీరు ప్రేమించే అమ్మాయి లేదా అబ్బాయి కోసం కవితలు కావాలనుకుంటే కూడా సర్చ్ బాక్స్‌లో టైప్ చేస్తే.. కవితలు కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి.

చాట్ జీపీటీ యాప్ ఇచ్చిన ఫలితాల్లో మీకు అవసరమైన కంటెంట్ తీసుకుని, మీకు నచ్చినట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు.

చాట్‌జీపీటీ ఇచ్చిన ప్రేమ కవితల, లేఖల కంటెంట్‌ను లేదా సమాధానాలను మీరు కచ్చితంగా జాగ్రత్తగా పరిశీలించాలి.

ఎందుకంటే ఆ కంటెంట్‌లో చిన్న పొరపాట్లు జరిగిన పదాలకు అర్థాలు మారిపోతాయి, తరువాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

కాబట్టి మీకు అవసరమైన కంటెంట్ ఉంచి, అనవసరమైన కంటెంట్ తీసేసి సొంతంగా తయారు చేసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.