ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల అనేక ప్రయోజనాలు.. 

TV9 Telugu

12 January 2025

ప్రతిరోజూ ఉదయాన్నే నిద్ర లేవాలని పెద్దలు చెబుతూంటారు. ఇప్పటకీ దేశవ్యాప్తంగా పల్లెటూర్లలో ఇదే ఆచరిస్తూంటారు.

రోజూ ఉదయాన్నే నిద్రలేవడం మంచి అలవాటు. పని ఉన్నా లేకపోయినా.. ఏ సీజన్ అయినా కొంత మంది ఉదయాన్నే లేస్తారు.

ప్రస్తుతం మాత్రం అర్థ రాత్రుళ్ల వరకూ ఫోన్లు, టీవీలు చూడటం.. ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు.

ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల చాలా సమయం ఉంటుంది. హడావిడిగా వెళ్లటం కంటే.. కాస్త వ్యాయామం, వాకింగ్ చేసేందుకు సమయం దొరుకుతుంది.

తరుచూ ఉదయాన్నే నిద్రలేవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బరువును అదుపులో ఉంచడానికి హెల్ప్ అవుతుంది.

ఉదయం నిద్రలేచిన తర్వాత స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల శరీర కణాలు బలపడతాయి. దీనితో పాటు ఫోకస్ చేసే శక్తి పెరుగుతుంది.

సాధారణంగా ఉదయాన్నే లేవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి దూరం అవ్వొచ్చు. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

ప్రతిరోజూ ఉదయాన్నే లేవడం వల్ల రాత్రి కూడా సమయానికి నిద్ర పడుతుంది. దీంతో నిద్ర నాణ్యత అనేది పెరుగుతుంది.